లంక క్రికెటర్ కుశల్ పెరీరాపై నాలుగేళ్లపాటు నిషేధం
కొలొంబో: శ్రీలంక జాతీయ క్రికెటర్ కుశాల్ పెరీరా డోపింగ్‌కు పాల్పడినట్లు తాజాగా రుజువు కావడంతో అతనిపై నాలుగేళ్ల నిషేధం పడింది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఖతార్‌లో నిర్వహించిన డోపింగ్ టెస్టులో అతని యూరిన్ శాంపిల్స్ పాజిటివ్‌గా వచ్చాయి.
ఈ విషయాన్ని ఐసీసీ తమ దృష్టికి తీసుకొచ్చినట్లు శ్రీలంక క్రీడాశాఖా మంత్రి దయసిరి జయశేఖర తెలిపారు. కుశల్ పెరీరా నిషేధిత ద్రవ పదార్థాన్ని తీసుకున్నట్లు అతనికి నిర్వహించిన డోపింగ్ టెస్టు శాంపిల్స్ లో బహిర్గతమైనట్లు తెలిపారు.

కాగా, దీనిపై అప్పీల్ చేసుకునే అవకాశాన్ని పరిశీలిస్తామని దయసిరి జయశేఖర్ పేర్కొన్నారు. ఇలా శ్రీలంక క్రికెట్‌లో డోపింగ్ టెస్టులో పట్టుబడిన రెండో క్రికెటర్‌గా పెరీరా సంచలనం సృష్టించాడు. కాగా, 2011లో ఉపుల్ తరంగా ఈ తరహాలోనే పట్టుబడి మూడు నెలలు బహిష్కరణకు గురయ్యాడు.
Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications