Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆసియా కప్‌కు ముందే లంకకు పెద్ద దెబ్బ: చండిమాల్‌ దూరం

Asia Cup 2018 : Dinesh Chandimal Replaced By Niroshan Dickwella
Sri Lanka’s Dinesh Chandimal Ruled Out of Asia Cup with Fractured Finger

హైదరాబాద్: ఆసియా కప్ ప్రారంభానికి ముందే శ్రీలంక జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లంక టెస్టు కెప్టెన్‌ దినేశ్ చండిమాల్‌ ఆసియా కప్‌కు దూరం కానున్నాడు. ఈ మేరకు ఆ దేశ బోర్డు అధికారిక ప్రకటన చేసింది.

దేశవాళీ టోర్నీలో వేలికి గాయం అవడంతో చండీమాల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ క్రికెట్‌ బోర్డు ట్విట్టర్‌లో తెలిపింది. యూఏఈ వేదికగా శనివారం నుంచి ఆరంభం కానున్న ఆసియా కప్‌ కోసం సోమవారం ప్రకటించిన జట్టులో అతడి స్థానంలో నిరోషన్‌ డిక్వెలా చోటు దక్కించుకున్నాడు.

ఆసియా కప్‌లో దినేశ్ చండీమాల్ లేకపోవడం ఆ జట్టుకు పెద్ద దెబ్బేనని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. శ్రీలంక తరుపున చండీమాల్ ఇప్పటివరకు 32.69 యావరేజితో 3000కుపైగా పరుగులు చేశాడు. లంక తరుపున చండీమాల్ ఈ ఏడాది జనవరిలో చివరి వన్డే ఆడాడు.

ఆసియా కప్‌కు శ్రీలంక జట్టు:
ఏంజెలో మాథ్యూస్‌ (కెప్టెన్‌), కుశాల్‌ పెరీరా, కుశాల్‌ మెండీస్‌, ఉపుల్‌ తరంగ, నిరోషన్‌ డిక్వెలా, ధనుష్క గుణతిలక, తిశార పెరీరా, దాసన్‌ షనక, ధనంజయ డి సిల్వా, అఖిల ధనంజయ, దిల్రువన్‌ పెరీరా, అమిల అపొన్సో, కాసన్‌ రజిత, సురంగ లక్మల్‌, దుష్మంత చమీరా, లసిత్‌ మలింగ.

స్టాండ్ బై: షీహన్ మధుశనక, నువాన్ ప్రదీప్, షీహన్ జయసూర్య, సందకన్

Story first published: Tuesday, September 11, 2018, 11:57 [IST]
Other articles published on Sep 11, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+