న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దలైలామా దర్శనమే లంకకు కలిసొచ్చిందా.. కోహ్లీ లేమితో పరాజయం ఎదురైందా..

Sri Lanka’s cricketers to meet Dalai Lama ahead of the ODI

ధ‌ర్మ‌శాల వేదిక‌గా జ‌రిగిన శ్రీలంక‌, భార‌త్‌ల మ‌ధ్య జ‌రిగిన తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియాపై శ్రీలంక భారీ విజయం సాధించింది. భారత్‌ నిర్దేశించిన 112 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు నష్టపోయి 20.4 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్‌ ఉపుల్‌ తరంగ (49; 46 బంతుల్లో 10×4) అద్భుతంగా ఆడాడు. ఏంజెలో మాథ్యూస్‌ (25; 42 బంతుల్లో 5×4), నిరోషన్‌ డిక్వెలా (26; 24 బంతుల్లో 5×4) అజేయంగా నిలిచారు. బుమ్రా, భువి, పాండ్య తలో వికెట్‌ పడగొట్టారు. అంతకుముందు భారత్‌లో ధోనీ (65; 87 బంతుల్లో 10×4, 2×6) అర్ధశతకం బాదాడు.

ఈ నేప‌థ్యంలో ఇవాల్టి ఉద‌యమే ధ‌ర్మ‌శాలకు భార‌త్ క్రికెట‌ర్ల‌తో పాటు లంక క్రికెట‌ర్లు సైతం వచ్చేశారు. ప్రాక్టీస్ సెష‌న్ ముగియ‌గానే లంక క్రికెటర్లు ద‌లైలామాను క‌ల‌వ‌డానికి వెళ్లారు. హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో ద‌లైలామా ఉండే ప్రాంతం ధ‌ర్మ‌శాలకు ద‌గ్గరే. లంక జ‌ట్టు ఆమోదం మేర‌కే వారు ద‌లైలామాను క‌లిసేందుకు వెళ్లారు. గతంలో ఆసీస్‌ జట్టు భారత్‌లో పర్యటించిన సమయంలో ఆ జట్టు సారథి స్టీవ్‌ స్మిత్‌ దలైలామా నుంచి ఆశీస్సులు తీసుకున్నాడు.

ఈ విష‌య‌మై లంక క్రికెట‌ర్లపై అభిమానులు సోష‌ల్ మీడియాలో భారీ ఎత్తున చుర‌కలు అంటించారు. 'టెస్ట్ సిరీస్ గెల‌వలేక‌పోవ‌డంతో ఇప్పుడు వ‌న్డే పై భ‌యం ప‌ట్టుకుంది. అందుకే ఆశీర్వాదానికై బ‌య‌ల్దేరారు. ఒక్క మ్యాచ్‌ అయినా గెలిచేలా దీవించాలని గురువును కోరుకున్నారేమో' అంటూ నెటిజన్లు తమ అభిప్రాయాలు వెల్లడించారు. క్రిందటి వారం ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో జరిగిన భారత్-శ్రీలంక టెస్ట్ మ్యాచ్ లో భారత్ గెలిచిన సంగతి తెలిసిందే.

అయితే వీళ్ల అభిప్రాయాలు, అపోహ‌లు అన్ని బ‌ద్ద‌లు కొట్టే విధంగా లంక క్రికెటర్లు ఆడి భార‌త్‌ను క‌ట్టుదిట్టం చేశారు. చాలా త‌క్కువ ల‌క్ష్యం పెట్టుకుని విజేత‌లుగా నిలిచారు. కోహ్లీ లేకపోవడం కొత్త సారథి రంగంలోకి దిగడం కూడా టీమిండియా వైఫల్యానికి కారణమంటూ కొత్త అభిప్రాయాలూ పుట్టుకువస్తున్నాయి.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Sunday, December 10, 2017, 17:55 [IST]
Other articles published on Dec 10, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X