Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ద‌లైలామా ద‌ర్శ‌నం కోసం లంక క్రికెట‌ర్లు

Sri Lanka’s cricketers to meet Dalai Lama ahead of the 1st ODI

హైద‌రాబాద్‌: భార‌త్-శ్రీలంకల మ‌ధ్య డిసెంబ‌రు 10 అంటే నేడు వ‌న్డే మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే ధ‌ర్మ‌శాలకు భార‌త్ క్రికెట‌ర్ల‌తో పాటు లంక క్రికెట‌ర్లు సైతం వచ్చేశారు. ప్రస్తుతం ప్రాక్టీస్ సెష‌న్ ముగియ‌డంతో లంక క్రికెటర్లు ద‌లైలామాను క‌ల‌వ‌నున్నారు. వీళ్లు మ్యాచ్ మొద‌లు కాక‌ముందే ద‌లైలామాను క‌లిసి ఆశీర్వాదం తీసుకోనున్నారు.

హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో ద‌లైలామా ఉండే ప్రాంతం ధ‌ర్మ‌శాలకు ద‌గ్గరే. లంక జ‌ట్టు ఆమోదం మేర‌కే వారు ద‌లైలామాను క‌ల‌వ‌నున్నారు. గతంలో ఆసీస్‌ జట్టు భారత్‌లో పర్యటించిన సమయంలో ఆ జట్టు సారథి స్టీవ్‌ స్మిత్‌ దలైలామా నుంచి ఆశీస్సులు తీసుకున్నాడు.

ఈ విష‌య‌మై లంక క్రికెట‌ర్లపై అభిమానులు సోష‌ల్ మీడియాలో భారీ ఎత్తున చుర‌కలు అంటిస్తున్నారు. 'టెస్ట్ సిరీస్ గెల‌వలేక‌పోవ‌డంతో ఇప్పుడు వ‌న్డే పై భ‌యం ప‌ట్టుకుంది. అందుకే ఆశీర్వాదానికై బ‌య‌ల్దేరారు. ఒక్క మ్యాచ్‌ అయినా గెలిచేలా దీవించాలని గురువును కోరుకున్నారేమో' అంటూ నెటిజన్లు తమ అభిప్రాయాలు వెల్లడించారు. క్రిందటి వారం ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో జరిగిన భారత్-శ్రీలంక టెస్ట్ మ్యాచ్ లో భారత్ గెలిచిన సంగతి తెలిసిందే.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Sunday, December 10, 2017, 10:09 [IST]
Other articles published on Dec 10, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+