Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అరుదైన ఘనత: ఒకే మ్యాచ్‌లో రెండు డబుల్ సెంచరీలు చేసిన పెరీరా

Sri Lanka’s Angelo Perera becomes second man to score two double hundreds in a first-class game

హైదరాబాద్: శ్రీలంక క్రికెటర్‌ ఏంజెలో పెరీరా అరుదైన ఘనత సాధించాడు. ఒకే మ్యాచ్‌లో రెండు డబుల్‌ సెంచరీలు సాధించిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు. శ్రీలంక ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో భాగంగా నాండేస్రిప్ట్స్‌కు సారథిగా వ్యవహరిస్తున్న పెరీరా సింహలీస్ స్పోర్ట్స్ క్లబ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో 201 పరుగులు చేసిన పెరీరా.. రెండో ఇన‍్నింగ్స్‌లో 231 పరుగుల వ్యక్తిగత స్కోరు సాధించాడు. చివరిసారి 1938లో ఇలా రెండు ఇన్నింగ్స్‌లోనూ డబుల్ సెంచరీలు చేసిన రికార్డు నమోదైంది. ఇంగ్లండ్‌లోని కెంట్‌కు చెందిన ఆర్థర్ ఫాగ్ 244, 202 పరుగులు చేశాడు.

వందుకుపైగా పెరీరా స్ట్రైక్‌రేట్‌

వందుకుపైగా పెరీరా స్ట్రైక్‌రేట్‌

జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరిగిన ఈ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో పెరీరా 203 బంతులను ఎదుర్కొని 20 ఫోర్లు, 1 సిక్సర్‌ సాయంతో డబుల్‌ సెంచరీ సాధించాడు. ఇక్కడ అతని స్ట్రైక్‌రేట్‌ దాదాపు వంద ఉండటం విశేషం. ఇక, రెండో ఇన్నింగ్స్‌లో పెరీరా మరింత రెచ్చిపోయి ఆడాడు.

డ్రాగా ముగిసిన మ్యాచ్

డ్రాగా ముగిసిన మ్యాచ్

రెండో ఇన్నింగ్స్‌లో 268 బంతుల్లో 20 ఫోర్లు, 3 సిక్సర్లతో 231 పరుగుల్ని నమోదు చేయడంతో నాండేస్రిప్ట్స్‌ జట్టు 6 వికెట్లకు 579 పరుగులు చేసింది. అయితే, ఈ మ్యాచ్ డ్రాగా ముగిసినా.. పెరీరా మాత్రం అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.

2013లో అరంగేట్రం చేసిన పెరీరా

2013లో అరంగేట్రం చేసిన పెరీరా

2013లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌ ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేసిన పెరీరా.. ఇప్పటివరకూ కేవలం నాలుగు వన్డేలు, రెండు టీ20లు మాత్రమే ఆడాడు. పెరీరా చివరగా ఆస్ట్రేలియాతో 2016లో జరిగిన సిరీస్‌లో లంక తరఫున కనిపించాడు. ఇక ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లో 97 మ్యాచ్‌లు ఆడిన పెరీరా 18 సెంచరీలు, 33 హాఫ్‌ సెంచరీలతో 6,941 పరుగులు చేశాడు.

Story first published: Monday, February 4, 2019, 18:35 [IST]
Other articles published on Feb 4, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+