Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Sri lanka: ఫ‌స్ట్ టీ20లు పెట్టండి ప్లీజ్.. బీసీసీఐకి శ్రీ‌లంక రిక్వెస్ట్‌

Sri Lanka requests BCCI to host T20 series for first on India tour
India vs Sri Lanka 2022 Schedule May Change As SL Cricket Board Requests BCCI | Oneindia Telugu

వ‌చ్చే నెల‌లో శ్రీ‌లంక జ‌ట్టు భార‌త్‌లో ప‌ర్య‌టించ‌నుంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా టీమిండియాతో శ్రీ‌లంక రెండు టెస్ట్ మ్యాచ్‌లు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ ప‌ర్య‌ట‌న ఫిబ్ర‌వ‌రి 25 నుంచి ప్రారంభం కానుంది. ఫిబ్ర‌వ‌రి 25 నుంచి బెంగ‌ళూరు వేదిక‌గా భార‌త్‌, శ్రీలంక మ‌ధ్య‌ జ‌రిగే టెస్ట్ మ్యాచ్‌తో ప్రారంభ‌మ‌వుతుంది. ఈ క్ర‌మంలో శ్రీ‌లంక క్రికెట‌ర్ బోర్డు బీసీసీఐకి ఒక విజ్ఞ‌ప్తి చేసింది. ఈ మేర‌కు బీసీసీఐకి ఒక లేఖ రాసింది. భార‌త్, శ్రీ‌లంక ప‌ర్య‌ట‌న‌ను టెస్టుల‌కు బ‌దులు మొద‌లు టీ20లతో ప్రారంభించాల‌ని ఆ విజ్ఞ‌ప్తిలో కోరింది. టీ20 సిరీస్‌తో ఈ ప‌ర్య‌ట‌న‌ను ప్రారంభించాల‌ని విజ్ఞ‌ప్తి చేసింది.

ఎందుకంటే భార‌త ప‌ర్య‌ట‌న‌కు ముందు శ్రీ‌లంక జ‌ట్టు ఆస్ట్రేలియాలో ప‌ర్య‌టించ‌నుంది. ఆ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఫిబ్ర‌వ‌రి 11 నుంచి 20 మ‌ధ్య కంగారుల‌తో లంక 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడ‌నుంది. దీంతో ఆ వెంట‌నే 25 నుంచి ప్రారంభ‌మ‌య్యే భార‌త ప‌ర్య‌ట‌న‌ను కూడా టీ20 సిరీస్‌తో ప్రారంభిస్తే బాగుంటుంద‌ని శ్రీ‌లంక క్రికెట్ బోర్డు భావిస్తోంది. త‌ద్వారా బ‌యోబ‌బుల్ వంటి స‌మ‌స్య కూడా ఉండ‌ద‌ని అనుకుంటుంది. ఎందుకంటే ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో ఆడే జ‌ట్టే భార‌త్‌లోనూ టీ20 సిరీస్ ఆడ‌నుంది. అందుకే అప్ప‌టికే బ‌యోబబుల్‌లో ఉన్న జ‌ట్టుతో భార‌త్‌లో టీ20ల‌తో ప‌ర్య‌ట‌న‌ను ఆరంభిస్తే ఒత్తిడి కూడా త‌క్కువ‌గా ఉంటుంద‌ని శ్రీ‌లంక భావిస్తోంది. అలాగే అప్ప‌టికే బ‌యోబబుల్‌లో ఉన్న టీం క‌నుక పెదగా బ‌బుల్ స‌మ‌స్య కూడా ఉండ‌ద‌ని అభిప్రాయ‌ప‌డుతుంది. అయితే ఈ విష‌య‌మై బీసీసీఐ నుంచి ఇంకా ఎటువంటి స్పంద‌ని రాలేదు. కానీ శ్రీ‌లంక ఇలా విజ్ఙ‌ప్తి చేసిన‌ట్టు మాత్రం బీసీసీఐ వ‌ర్గాల ద్వారా స‌మాచారం అందింది.

కాగా ఇదివ‌ర‌కు నిర్ణ‌యించిన షెడ్యూల్ ప్ర‌కారం భార‌త్, శ్రీ‌లంక ప‌ర్య‌ట‌న ఫిబ్ర‌వ‌రి 25 నుంచి ప్రారంభంకానుంది. ఫిబ్ర‌వ‌రి 25 నుంచి బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా తొలి టెస్టు మ్యాచ్‌, మార్చి 5 నుంచి మోహాలీ స్టేడియంలో రెండో టెస్టు మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఇక 13, 15, 18 తేదీల‌లో మోహాలీ, ధ‌ర్మ‌శాల‌, ల‌క్నో వేదిక‌లుగా 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జ‌ర‌గాల్సి ఉంది. అయితే భార‌త్‌లో ప్ర‌స్తుతం క‌రోనా కేసులు భారీగా న‌మోద‌వుతుండ‌డంతో ఈ వేదిక‌ల‌ను కుదించే అవ‌కాశం ఉంది. ఒకటి లేదా రెండు వేదిక‌ల‌లోనే రెండు సిరీస్‌ల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు స‌మాచారం. అయితే సిరీస్ ప్రారంభ‌మ‌వ‌డానికి ఇంకా నెల రోజుల స‌మ‌యం ఉండ‌డంతో అప్ప‌టి ప‌రిస్థితుల‌కు అనుగుణంగా బీసీసీఐ నిర్ణ‌యం తీసుకోనుంది.

Story first published: Wednesday, January 26, 2022, 17:48 [IST]
Other articles published on Jan 26, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+