అనుకున్నదే జరిగింది: విండిస్‌కు షాక్, వరల్డ్ కప్‌కు శ్రీలంక అర్హత
హైదరాబాద్: వెస్టిండిస్.. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన జట్టు. అయితే ఈ మధ్యకాలంలో ఈ జట్టు ఆటతీరు తీసికట్టుగా తయారైంది. ఎంతలా ఆంటే 2019లో ఇంగ్లండ్‌లో జరిగే వరల్డ్ కప్‌కి నేరుగా అర్హత సాధించలేకపోయింది. వన్డే క్రికెట్‌లో రెండు సార్లు ప్రపంచ చాంపియన్, మరోసారి ఫైనలిస్ట్ అయిన జట్టు విండిస్‌కు ఇది ఊహించని పరిణామమే.
ఇంగ్లాండ్ వేదికగా 2019లో జరిగే వన్డే ప్రపంచ కప్‌నకు నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని వెస్టిండిస్ కోల్పోయింది. మంగళవారం వెస్టిండిస్‌తో జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య ఇంగ్లాండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయం విండిస్ వరల్డ్ కప్ ఆశలను గల్లంతు చేశాయి.

వెస్టిండిస్‌కు షాక్
వెస్టిండిస్ ఓటమి పాలవ్వడంతో వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్-8లో చివరి స్థానంలో ఉన్న లంక నేరుగా అర్హత సాధించింది. ప్రస్తుతం లంక జట్టు 86 పాయింట్లు, విండీస్ 78 పాయింట్లతో ఉన్నాయి. అయితే 2019 వరల్డ్ కప్ టోర్నీకి అర్హత సాధించాలంటే ఈ సెప్టెంబర్ 30లోగా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ 8లో ఉండాలి.

క్వాలిఫై మ్యాచ్‌లు ఆడకుండానే నేరుగా అర్హత
అయితే ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ను విండీస్ 5-0తో గానీ, 4-0తో గానీ ముగిస్తే వెస్టిండిస్ టాప్-8లో నిలిచి క్వాలిఫై మ్యాచ్‌లు ఆడకుండానే నేరుగా అర్హత సాధించేది. ఐర్లాండ్‌తో ఓ వన్డే, ఇంగ్లాండ్‌తో ఐదు వన్డేల సిరీస్ ఆడాల్సి ఉండగా.. ఐర్లాండ్‌తో బుధవారం జరగాల్సిన మ్యాచ్ భారీ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు అయింది.

2018లో జింబాబ్వేలో జరిగే క్వాలిఫయింగ్ టోర్నీ
ఈ మ్యాచ్‌లో వెస్టిండిస్ విజయం సాధిస్తే, ఇంగ్లండ్‌తో జరిగే ఐదు వన్డేల సిరీస్‌లో విండీస్ 4-1తో గెలిస్తే సరిపోయేది. అయితే ఐర్లాండ్ మ్యాచ్ రద్దు అవడం, ఇప్పుడు తొలి వన్డేలో ఇంగ్లాండ్ చేతిలో ఓడిన వెస్టిండిస్ ఇతర మ్యాచ్‌లలో విజయాలు సాధించినా ఆ జట్టు నేరుగా క్వాలిఫై అవదు. దీంతో 2018లో జింబాబ్వేలో జరిగే క్వాలిఫయింగ్ టోర్నీలో వెస్టిండిస్ ఆడి 2019 వన్డే వరల్డ్ కప్‌కు అర్హత సాధించాల్సి ఉంటుంది.

రెండుసార్లు వరల్డ్ కప్ విజేతగా
రెండుసార్లు వరల్డ్ కప్ విజేతగా (1975, 1979) నిలిచి, మరోసారి ఫైనల్ (1983)కు చేరి తమ సత్తా చాటిన జట్టు వెస్టిండిస్ జట్టు ఆట తీరు నానాటికి దిగజారిపోతోంది. టెస్టులు, వన్డేల్లో పూర్తిగా విఫలమవుతున్న వెస్టిండిస్ ఆటగాళ్లు తమకు అచ్చొచ్చిన టీ20 ఫార్మాట్‌లో మాత్రం చెలరేగుతున్నారు. ఈ ఫార్మాట్‌లో రెండు పర్యాయాలు విజేతగా నిలిచిన వెస్టిండిస్ వన్డేల్లో అత్యంత చెత్త ప్రదర్శనను కనబరుస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications