Sri Lanka తొలి వన్డేలో టీమిండియాతో తలపడే జట్టు ఇదే! సగం కొత్తవారే! ధావన్ సేన క్లీన్ స్వీప్ చేయడం ఖాయమేనా?

హైదరాబాద్: భారత్, శ్రీలంక జట్ల మధ్య ఆదివారం నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే కొలొంబోలోని ప్రేమదాస స్టేడియంలో మధ్యాహ్నం 3 గంటలకు ఆరంభం కానుంది. శిఖర్ ధావన్ నేతృత్వంలోని భారత యువ జట్టును డసన్ షనక సారథ్యంలోని కొత్త జట్టు ఢీకొనబోతోంది. ఇరు జట్లలో సగం మందికి పైగా కొత్త ప్లేయర్స్ ఉన్నా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఎంతో అనుభవం ఉన్న టీమిండియానే ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది. తొలి వన్డే ఆడనున్న లంక జట్టును ఓసారి చూద్దాం.
కొత్త సారథిగా డసన్ షనక:
టీమిండియాతో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌ల కోసం 25 మంది సభ్యులతో కూడి జంబో జట్టును శ్రీలంక క్రికెట్ బోర్డు శుక్రవారం ఎంపిక చేసింది. గాయం కారణంగా మాజీ కెప్టెన్ కుశాల్ పెరీరా, బినురా ఫెర్నాండో సిరీస్ మొత్తానికి దూరమయ్యారు. ఇక లంక నూతన సారథిగా డసన్ షనక ఎంపికయ్యాడు. గత నాలుగేళ్లలో శ్రీలంకకు షనక ఆరో కెప్టెన్. 2018 నుంచి దినేశ్ చండీమాల్, ఎంజెలో మాథ్యూస్, లసిత్ మలింగ, దిముత్ కరుణరత్నే, కుశాల్ పెరీరా కెప్టెన్లుగా వ్యవహరించారు. వరుస పరాజయాల కారణంగా లంక బోర్డు పదేపదే కెప్టెన్లు మారుస్తోంది.
ఓపెనర్‌గా పాతుమ్ నిస్సంకా:
ఇక తొలి వన్డేలో పాతుమ్ నిస్సంకా, చరిత్ అసలాంకా ఓపెనింగ్ చేయనున్నారు. లంక తరఫున నిస్సంకా 9 వన్డేలు ఆడగా.. అసలాంకా 2 మ్యాచులు ఆడాడు. భారత స్వింగ్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్‌లను తట్టుకుని ఈ ఇద్దరు ఏ మేరకు రాణిస్తారో చూడాలి. మూడో స్థానంలో కెప్టెన్ డసన్ షనక ఆడనున్నాడు. అవిష్కా ఫెర్నాండో, వానిందు హరసరంగ, రామేశ్ మెండీస్, ధనుంజయ డిసిల్వా మిడిల్ ఆర్డర్ భారం మోయనున్నారు. ప్రవీణ్ జయవిక్రెమా .. పేస్ కోటాలో చామిక కరుణరత్నే, దుష్మంత చమీరా, ఇసురు ఉడాన చోటు దక్కించుకొనున్నారు.

5 కంటే ఎక్కువ వన్డేలు ఆడలేదు:
ప్రస్తుత లంక జట్టులో సగానికి పైగా మంది కొత్తవారే. చాలా మంది 5 కంటే ఎక్కువ వన్డే మ్యాచులు ఆడలేదు. అసలాంకా 2, రామేశ్ 2, చామిక 4, ప్రవీణ్ 1 వన్డే ఆడారు. మరోవైపు భారత జట్లలో సగం మందికి పైగా కొత్త ప్లేయర్స్ ఉన్నారు. అయితే అందరికి ఐపీఎల్ అనుభవం ఉండడం కలిసొచ్చే అంశం. లంక జట్టుపై ధావన్ సేన క్లీన్ స్వీప్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రేమదాస స్టేడియంలో వన్డేల్లో మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు 235. 300 స్కోర్ వచ్చే అవకాశం ఉంది. ఈ ట్రాక్‌లో ఇరు జట్లు మొదట బ్యాటింగ్ చేయడానికి చూస్తాయి. మ్యాచ్ సాగుతున్నా కొద్దీ వికెట్ బ్యాటింగ్‌కు కష్టమవుతుంది. వర్ష సూచనలు లేవు.
శ్రీలంక తుది జట్టు ఇదే:
పాతుమ్ నిస్సంకా, చరిత్ అసలాంకా, డసన్ షనక (కెప్టెన్), అవిష్కా ఫెర్నాండో, వానిందు హరసరంగ, రామేశ్ మెండీస్, ధనుంజయ డిసిల్వా, ప్రవీణ్ జయవిక్రెమా, చామిక కరుణరత్నే, దుష్మంత చమీరా, ఇసురు ఉడాన.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications