
2017లో చివరి వన్డే మ్యాచ్:
గత కొన్నేళ్లుగా ఫామ్‌తో సతమతమవుతున్న కులశేఖర జాతీయ జట్టుకు ఎంపిక కాలేదు. తాజాగా ముగిసిన ప్రపంచకప్‌లో సైతం కులశేఖర చోటు దక్కించుకోలేదు. గత కొంత కాలంగా కులశేఖర లిస్ట్-ఏ క్రికెట్‌లో ఆడుతున్నాడు. 2017లో చివరి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడాడు. 2014 టీ20 ప్రపంచకప్‌ను శ్రీలంక గెలవడంలో కీలకపాత్ర పోషించాడు.

వన్డే ర్యాంకింగ్స్‌ల్లో నంబర్ వన్:
2007, 2011 వన్డే ప్రపంచకప్‌లలో రన్నరప్‌గా నిలిచిన లంక జట్టులోనూ కులశేఖర సభ్యుడిగా ఉన్నాడు. ముఖ్యంగా 2011 వన్డే ప్రపంచకప్‌లో మలింగతో కలిసి బౌలింగ్ విభాగం మోశాడు. ఇక 2008 ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ల్లో నంబర్ వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. బంతితోనే కాకుండా అప్పుడప్పుడు బ్యాటింగ్‌లో మెరిశాడు.

184 వన్డేలు.. 199 వికెట్లు:
2003లో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌తో కులశేఖర ఆరంగేట్రం చేసాడు. 2017లో చివరి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడాడు. మొత్తం 184 వన్డేల్లో 4.90 ఎకానమీతో 199 వికెట్లు తీసాడు. 199 వికెట్లతో శ్రీలంక తరపున ఐదో అత్యధిక వికెట్ల తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇక 58 టీ20ల్లో 66 వికెట్లు పడగొట్టాడు. దీంతో రెండో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

టెస్టుల్లో విఫలం:
వన్డేల్లో విజవంతమైన ఈ పేసర్ టెస్టుల్లో మాత్రం విపలమయ్యాడు. 21 టెస్టులాడి 48 వికెట్లు మాత్రమే తీశాడు. 2016లోనే టెస్టులకు వీడ్కోలు పలికినా.. వన్డేల్లోనూ అంతగా ఆకట్టుకోకపోవడంతో లిస్ట్-ఏ క్రికెట్ మ్యాచ్‌లు మాత్రమే ఆడుతున్నాడు. రిటైర్‌మెంట్‌పై కులశేఖరకు శ్రీలంక మాజీలు, క్రికెటర్లు అభినందనలు తెలుపుతున్నారు.


Click it and Unblock the Notifications












