Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒక్క మ్యాచ్ ఓడితే ఇంటికే..!

Asia Cup 2025: ఆసియా కప్ 2025 సూపర్-4 ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్ జట్టు శ్రీలంకను 4 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ గెలుపుతో బంగ్లాదేశ్ సూపర్-4లో విజయం సాధించిన మొదటి జట్టుగా నిలిచింది. సూపర్-4లో పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఏ జట్టు ఓడిపోయినా టోర్నమెంట్ నుంచి బయటపడే ప్రమాదం పెరుగుతుంది. ఆసియా కప్ లీగ్ దశలో టోర్నమెంట్ గెలిచేందుకు స్ట్రాంగ్ జట్టుగా భావించిన శ్రీలంక ఇప్పుడు ప్రమాదంలో పడింది.

ఇబ్బందుల్లో ఇరుకున్న శ్రీలంక
బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 169 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన శ్రీలంక జట్టు చివరి బంతికి ముందు ఈ మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈ పరాజయంతో టోర్నమెంట్ నుంచి తప్పుకునే ప్రమాదం వారికి పొంచి ఉంది. ఎందుకంటే శ్రీలంకతో పాటు సూపర్ 4లో మరో మూడు జట్లు ఉన్నాయి. అంటే, ప్రతి ఓటమితోనూ జట్లపై టోర్నమెంట్ నుంచి బయటికి వెళ్లే ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా శ్రీలంకకు మిగిలిన మ్యాచ్‌లు భారత్, పాకిస్తాన్ వంటి బలమైన జట్లతో ఉన్నాయి. ఇక్కడ మరో ఓటమి వారిని టోర్నమెంట్ నుంచి బయటకు పంపేస్తుంది.

Sri Lanka on the Brink of Elimination One Loss Could End Their Asia Cup 2025 Campaign

భారత్-పాకిస్తాన్‌తో పోరాటం చెలగాటమే!
బంగ్లాదేశ్ చేతిలో పరాజయం తర్వాత శ్రీలంక జట్టు సెప్టెంబర్ 23న పాకిస్తాన్ తో తలపడుతుంది. పాకిస్తాన్ ప్రదర్శన అంత గొప్పగా లేదు.. కానీ ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందని భావిస్తున్నారు. ఇక సెప్టెంబర్ 26న శుక్రవారం శ్రీలంక టీమిండియాతో తలపడనుంది. టీమిండియాతో పోలిస్తే శ్రీలంక జట్టు చాలా బలహీనంగా ఉంది. అందువల్ల, వారికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.

బంగ్లాదేశ్ సూపర్ విక్టరీ
బంగ్లాదేశ్ జట్టు శ్రీలంకపై ఉత్కంఠపోరులో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 168 పరుగులు చేసింది. శ్రీలంక తరఫున దసున్ శనక 64 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ జట్టు తరఫున సైఫ్ హసన్ 61, తౌహిద్ హృదోయ్ 58 పరుగులు చేశారు. దీంతో బంగ్లాదేశ్ జట్టు చివరి ఓవర్లో ఒక బంతి మిగిలి ఉండగానే గెలిచేసింది.

Story first published: Sunday, September 21, 2025, 7:47 [IST]
Other articles published on Sep 21, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+