ఐపీఎల్‌కు మేం ఆతిథ్యమిస్తాం.. బీసీసీఐకి శ్రీలంక బోర్డు బంపరాఫర్!!

కొలంబో: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రీడారంగం పూర్తిగా స్తంభించిపోయింది. ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్, టెన్నిస్ గ్రాండ్‌స్లామ్స్, షూటింగ్ ప్రపంచకప్ సహా దాదాపు ప్రతి టోర్నీ వాయిదా లేదా రద్దు అయ్యాయి. ఈ నేపథ్యంలో మార్చి 29 నుంచే ప్రారంభం కావాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-13వ సీజన్ కూడా వాయిదా పడింది. గత నెలలో ఏప్రిల్ 15వ తేదీ వరకూ వాయిదా వేసిన బీసీసీఐ.. ఈసారి నిరవధిక వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

టోర్నీజరపాలనే భావనలో బీసీసీఐ:
కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావం పూర్తిగా తగ్గిపోయి ఎటువంటి ప్రమాదం లేదు అన్నప్పుడే ఐపీఎల్ కొత్త షెడ్యూల్‌ను ప్రకటిస్తామని బీసీసీఐ సెక్రటరీ జయ్ షా తెలిపాడు. కరోనా కారణంగా మున్ముందైనా జరుగుతుందా.. లేదా అనుమానం నెలకొంది. అయితే లీగ్ నిర్వాహకులు మాత్రం టోర్నీని ఎలాగైనా జరపాలనే భావనలో ఉన్నారు. ఎందుకంటే.. దీని ద్వారా బీసీసీఐ వేల కోట్ల సొమ్మును ఆర్జించే అవకాశాలుంటాయి. అందుకే ఇప్పటికీ రద్దు అనే మాటను మాత్రం బీసీసీఐ అధికారులు అనడం లేదు. అయితే ఐపీఎల్‌కు తాము ఆతిథ్యమిస్తామంటూ శ్రీలంక క్రికెట్ బోర్డు ముందుకొచ్చింది.

అవసరమైన వేదికలు, వనరులు ఉన్నాయి:
బీసీసీఐ బోర్డుకు అభ్యంతరం లేకుంటే ఐపీఎల్‌ను తమ దేశంలో నిర్వహిస్తామని శ్రీలంక క్రికెట్ అధ్యక్షుడు షమ్మి సిల్వ ఓ ప్రకటనలో తెలిపారు. ఐపీఎల్ నిర్వహణకు అవసరమైన వేదికలు, వనరులు మా దగ్గర ఉన్నాయని షమ్మి సిల్వా అన్నాడు. ఈ విషయంపై అతడు బీసీసీఐతో చర్చలు జరుపుతున్నాడట. కరోనా ఇతర దేశాలపై ఎక్కువగానే ప్రభావం చూపుతున్నా లంకలో అంత సీరియ్‌సగా లేదు. ఐపీఎల్ గతంలో రెండు సార్లు విదేశాల్లో జరిగింది. ఎన్నికల కారణంగా 2009లో దక్షిణాఫ్రికాలో, 2014లో తొలి అర్ధభాగాన్ని యూఏఈలో నిర్వహించారు.

ఐపీఎల్‌కు ఆతిథ్యమిస్తాం:
'ఒకవేళ ఐపీఎల్ ఈ ఏడాది రద్దయితే భారత క్రికెట్ బోర్డుతో పాటు ఐపీఎల్ వాటాదారులు 500 మిలియన్ డాలర్లు (రూ.3800 కోట్లు) నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి 2009లో దక్షిణాఫ్రికాలో నిర్వహించినట్టుగానే ఈసారి కూడా ఇతర దేశానికి తరలిస్తే ఆర్థికంగా కలిసి వస్తుంది. ఐపీఎల్‌కు ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ మా ప్రతిపాదన బీసీసీఐకి నచ్చితే శ్రీలంక ఆరోగ్య శాఖ అధికారుల పర్యవేక్షణలో అన్ని సౌకర్యాలను వారికి కల్పిస్తాం' అని షమ్మి సిల్వ హామీ ఇచ్చారు. ఈ నిర్వహణపై అటు ఆర్థికంగా చితికిపోయిన లంక బోర్డు కూడా భారీగానే లాభపడుతుంది. అయితే బీసీసీఐ ఎలా స్పదిస్తుందో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications