హైదరాబాద్: ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లాండ్‌లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనబోయే న్యూజిలాండ్, శ్రీలంక జట్లను ఆయా దేశాల బోర్డులు ప్రకటించాయి. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను సోమవారం ప్రకటించాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే శ్రీలంక జట్టుకి ఏంజిలో మాథ్యూస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
గాయం కారణంగా ఏంజిలో మాథ్యూస్ ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లకు దూరమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌లో ఏంజిలో మాథ్యూస్ ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇక మోకాలి గాయం కారణంగా ఐసీసీ వరల్డ్ టీ20కి దూరమైన మలింగ జట్టులో చోటు దక్కించుకున్నాడు.
ఇక, మలింగ ప్రస్తుతం ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇక న్యూజిలాండ్ జట్టుకు కేన్ విలియమ్సన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఐదుగురు స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్స్, నలుగురు పేసర్లు, ముగ్గురు ఆల్ రౌండర్లు, ఇద్దరు స్పిన్నర్లతో న్యూజిలాండ్ బరిలోకి దిగుతోంది.
శ్రీలంక జట్టు: ఏంజిలో మాథ్యూస్ (కెప్టెన్), ఉపుల్ తరంగ, నిరోషాన్ డిక్‌వెల్లా, కుశాల్ పెరిరా, కుశాల్ మెండీస్, చామర కాపుజేడెరా, ఏస్లా గునరత్నే, దినేశ్ చండీమాల్, లతీశ్ మలింగ, సురంగ లక్మల్, ప్రదీప్, కులశేఖర, థిశార పెరిరా, లక్ష్మణ్ సండకన్, ప్రసన్న.
న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), కోరే అండర్సన్, ట్రెండ్ బౌల్ట్, నీల్ బ్రూమ్, గ్రాండ్‌హోమ్, మార్టిన్ గప్తిల్, టామ్ లాథమ్, మిచెల్ మెక్లెనగన్, ఆడమ్ మిల్నే, జిమ్మి నీషాన్, జీతన్ పటేల్, ల్యూక్ రోంచి, మిచెల్ సట్నర్, టిమ్ సౌథీ, రాస్ టేలర్.