T20 World Cup 2022: గ్రూప్ ఎ నుంచి సూపర్-12కు వెళ్లేది ఎవరో తేలేది నేడే..

టీ20 వరల్డ్ కప్ లో సూపర్-12 మ్యాచ్ లు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. శుక్రవారంతో గ్రూప్ మ్యాచ్ లు ముగుస్తాయి. అయితే గ్రూప్ ఎ నుంచి సూపర్-12కు వెళ్లేది ఎవరో గురువారం తేలిపోనుంది. ఈ గ్రూప్ లో శ్రీలంక, నమీబియా, నెదర్లాండ్, యూఏఈ ఉన్నాయి. నెదర్లాండ్ ఇప్పటికే రెండు మ్యాచ్ లు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా.. శ్రీలంక నమీబియా ఒక్కో మ్యాచ్ గెలిచి రెండేసి పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇక యూఏఈ వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించినట్లే.
రన్ రేటు
గ్రూప్ ఎలో గురువారం శ్రీలకతో నెదర్లాండ్ తలపడనుంది. యూఏఈతో నమీబియా పోటీ పడనుంది. అయితే ప్రస్తుతం నమీబియాకు రన్ రేటు ఎక్కువగా ఉంది. ఒక వేళ నెదర్లాండ్ పై శ్రీలంక గెలిస్తే మెరుగైన రన్ రేటు ఉంటేనే సూపర్-12కు వెళ్తోంది. అటు యూఏఈపై నమీబియా గెలిస్తే.. సూపర్ -12 వెళ్లేందుకు శ్రీలంక, నెదర్లాండ్, నమీబియా పోటీ పడతాయి. అయితే వీటిలో మెరుగైన రన్ రేటు ఉన్న రెండు జట్లు సూపర్-12కు వెళ్తాయి. రన్ రేటు పరంగా మొదటి స్థానంలో నమీబియా, రెండో స్థానంలో శ్రీలంక, మూడు స్థానంలో నెదర్లాండ్ ఉన్నాయి.
శ్రీలంక, నెదర్లాండ్
గీలాంగ్ లోని సిమండ్స్ స్టేడియంలో గురువారం ఉదయం 9:30 గంటలకు శ్రీలంక, నెదర్లాండ్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది.
జట్ల అంచనా:
శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(w), ధనంజయ డి సిల్వా, భానుక రాజపక్స, చరిత్ అసలంక, దసున్ షనక(సి), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, ప్రమోద్ మదుషన్, మహేశ్ తీక్షణ, బినుర ఫెర్నాండో, లహిరు కుమార, జెఫ్రీ కుమార, దిల్షాన్ మధుశంక, దనుష్క గుణతిలక.
నెదర్లాండ్స్: మాక్స్ ఓడౌడ్, విక్రమ్‌జిత్ సింగ్, బాస్ డి లీడ్, టామ్ కూపర్, కోలిన్ అకెర్‌మాన్, స్కాట్ ఎడ్వర్డ్స్(w/c), టిమ్ ప్రింగిల్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, టిమ్ వాన్ డెర్ గుగ్టెన్, ఫ్రెడ్ క్లాసెన్, పాల్ వాన్ మీకెరెన్, స్టీఫెన్ లోగాన్ వాన్ బీక్, తేజా నిడమనూరు, బ్రాండన్ గ్లోవర్, షరీజ్ అహ్మద్.
నమీబియా, యూఏఈ
ఇదే స్టేడియంలో మధ్యాహ్నం 1:30 గంటలకు నమీబియా, యూఏఈ మధ్య మ్యాచ్ జరగనుంది.
జట్ల అంచనా:
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ : ముహమ్మద్ వసీమ్, చిరాగ్ సూరి, ఆర్యన్ లక్రా, చుండంగపోయిల్ రిజ్వాన్(సి), వృత్త్యా అరవింద్(w), బాసిల్ హమీద్, అయాన్ అఫ్జల్ ఖాన్, కాషిఫ్ దౌద్, కార్తీక్ మెయ్యప్పన్, జునైద్ సిద్దిక్, జహూర్ ఖాన్, అలీషాన్ షరాఫు, అహ్మద్ షరాఫు , జవార్ ఫరీద్, సబీర్ అలీ.
నమీబియా : మైఖేల్ వాన్ లింగేన్, దివాన్ లా కాక్, స్టీఫన్ బార్డ్, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, జాన్ ఫ్రైలింక్, గెర్హార్డ్ ఎరాస్మస్(సి), డేవిడ్ వైస్, JJ స్మిట్, జేన్ గ్రీన్(w), బెర్నార్డ్ స్కోల్ట్జ్, బెన్ షికోంగో, పిక్కీ యా ఫ్రాన్స్ , లోహండ్రే లౌరెన్స్, తంగేని లుంగమేని, కార్ల్ బిర్కెన్‌స్టాక్, రూబెన్ ట్రంపెల్‌మాన్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications