శ్రీలంక..ఇదేమి వింత! ఒక్క వికెట్ పడటమే ఆలస్యం..!

లండన్: ప్రపంచకప్ క్రికెట్ మెగా టోర్నమెంట్‌లో శ్రీలంక క్రికెట్ జట్టు పరిస్థితిలో ఎలాంటి మార్పూ రాలేదు. మ్యాచ్ మ్యాచ్‌కు రాటు దేలాల్సిన లంకేయులు.. దానికి భిన్నంగా ప్రవరిస్తున్నారు. నాసిరకం ఆటతీరును ప్రదర్శిస్తున్నారు. 2011 ప్రపంచకప్ ఫైనలిస్ట్ ఈ జట్టేనా అని అనిపించేంత దారుణంగా ఆటతీరును కనపరుస్తోంది శ్రీలంక క్రికెట్ జట్టు. లీడ్స్‌లోని హెడింగ్లే స్టేడియంలో శుక్రవారం ఆరంభమైన మ్యాచ్‌లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వరుసగా వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది శ్రీలంక. ఇలాంటి చెత్త ప్రదర్శన ఇవ్వడం ఆ జట్టుకు కొత్తేమీ కాదు గానీ.. మరీ ఇంతలా తీసినట్టుగా ఆడటం అభిమానులను బాధ కలిగించే విషయం.

వికెట్ పడితే.. వరుస కట్టినట్టే
ప్రస్తుత ప్రపంచకప్ టోర్నమెంట్‌లో ఇప్పటిదాకా శ్రీలంక ఆడిన మ్యాచ్‌లన్నింటిలోనూ మిడిలార్డర్ ఘోరంగా విఫలమైంది. ఒక్క వికెట్ పడితే చాలు.. పేకమేడలా కూలిపోతోంది ఆ జట్టు బ్యాటింగ్ లైనప్. న్యూజీలాండ్‌తో కార్డిఫ్‌లో జరిగిన మ్యాచ్‌లో 14 ఓవర్లకు ఒక వికెట్‌ను కోల్పోయి 46 పరుగులు చేసిన శ్రీలంక జట్టు.. ఆ తరువాత అయిదు ఓవర్ల వ్యవధిలో అయిదు వికెట్లను కోల్పోయింది. 14 ఓవర్లకు ఒక వికెట్ నష్టానికి 46 పరుగులు చేసిన ఆ జట్టు 19వ ఓవర్ ముగిసే సరికి అయిదు వికెట్లను కోల్పోయింది. 60 పరుగులే చేయగలిగింది.

ఆప్ఘన్‌తోనూ అదే దుస్థితి..
కార్డిఫ్‌లోనే ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కూడా శ్రీలంక జట్టుది అదే పరిస్థితి. ఒక దశలో- 15 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 144 పరుగులు చేసి, భారీ స్కోరుపై కన్నేసింది. ఆ తరువాత ఆ జట్టు మిడిలార్డర్ కుప్పకూలింది. మరో అయిదు ఓవర్లు ముగిసే సరికి 159 పరుగులకు అయిదు వికెట్లను కోల్పోయింది. 159 పరుగులకు ఆరు వికెట్లను నష్టపోయింది. ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ సందర్భంగా శ్రీలంక ఆటలో ఎలాంటి మార్పూ కనిపించలేదు. 205 పరుగులకు మూడు వికెట్లను కోల్పోయి, ఫర్వాలేదనిపించుకున్న దశలో కుప్పకూలింది. 17 పరుగుల తేడాతో నాలుగు వికెట్లను కోల్పోయింది. ఏడు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేయగలిగింది. ఆ తరువాత టెయిలెండర్లు కొద్దిగా ఆదుకున్నారు.

ఇంగ్లండ్‌తో కొద్దిగా బెటర్..
ప్రస్తుతం లీడ్స్ హెడింగ్లేలో కొనసాగుతున్న మ్యాచ్ లో కూడా ఇంగ్లండ్ మిడిలార్డర్ చెప్పుకోదగ్గ స్థాయిలో రాణిస్తోంది మిడిలార్డర్ బ్యాటింగ్ లైనప్. జట్టు స్కోరు మూడు పరుగుల వద్ద రెండు వికెట్లను కోల్పోయింది. 62 పరుగుల వద్ద మూడో వికెట్‌ను, 133 పరుగుల వద్ద 4, 5 వికెట్లను పోగొట్టుకుంది. ఆదిల్ రషీద్ వరుస బంతుల్లో కుశాల్ మెండిస్, జీవన్ మెండిస్‌ను పెవిలియన్ దారి పట్టించాడు. జీవన్ మెండిస్ అవుటైన తరువాత క్రీజులోకి వచ్చిన ధనంజయ డిసిల్వా.. హ్యాట్రిక్‌ను అడ్డుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications