Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్‌పై పాతికేళ్ల నాటి పగ తీరుతుందా?

IND vs SL 3rd ODI: భారత జట్టు ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో బిజీగా ఉంటోంది. ఇప్పటికే మూడు టీ20 ఇంటర్నేషనల్స్ సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఆడిన మూడింట్లోనూ ఘన విజయాన్ని అందుకుంది. లంకేయులను 3-0 తేడాతో మట్టికరిపించింది. సూపర్ ఓవర్ దాకా వెళ్లిన చివరి మ్యాచ్ మినహా మిగిలిన రెండింట్లోనూ వార్ వన్‌సైడ్ అయింది.

ఈ జైత్రయాత్రకు వన్డే ఇంటర్నేషనల్స్ సిరీస్‌లో బ్రేక్ వేశారు లంకేయులు. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన తొలి రెండు వన్డేల్లోనూ భారత్‌కు షాకుల మీద షాకులు ఇచ్చారు. తొలి వన్డేను టై చేశారు. రెండో మ్యాచ్‌లో దిగ్విజయాన్ని సొంతం చేసుకున్నారు. భారత్‌ను మట్టికరిపించారు. మూడు వన్డేల సిరీస్‌లో 1-0 తేడాతో ఆధిక్యతలో నిలిచారు.

Sri Lanka last beat India in a ODI series in August 1997 now gets chance to defeat

ఇప్పుడు మూడో వన్డే కోసం శ్రీలంక సన్నద్ధమైంది. ఈ మ్యాచ్ కూడా గెలిస్తే సిరీస్ లంక వశమౌతుంది. ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో చివరిసారిగా 1997లో టీమిండియాను ఓడించింది శ్రీలంక. ఈ సిరీస్‌ను సొంతం చేసుకుంది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క సిరీస్‌లో కూడా గెలవలేదు. చివరి 10 సిరీస్‌లల్లో ఓటమిపాలవుతూ వచ్చింది.

ఈ చెత్త రికార్డును చెరిపేసుకునే సువర్ణావకాశం లభించింది శ్రీలంకకు. ఈ రెండు జట్ల చివరిదైన మూడో వన్డే ఈ మధ్యాహ్నం 2:30 గంటలకు కొలంబోలని ప్రేమదాస స్టేడియంలో ఆరంభమౌతుంది. ఇందులో గెలిచి సిరీస్‌ను సమం చేయాలనే పట్టుదలతో భారత్.. దీన్ని కైవసం చేసుకోవాలనే కసితో ఉంది శ్రీలంక.

రెండు జట్లకూ ప్రతిష్ఠాత్మకంగా మారిన ఈ మ్యాచ్‌ ఆడే భారత తుదిజట్టులో- రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శివమ్ దూబే/రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ ఆడే అవకాశం ఉంది.

శ్రీలంక ప్లేయింగ్ 11లో- పథుమ్ నిశ్శంక, అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక (కెప్టెన్), జనిత్ లియానగే, దునిత్ వెల్లాలగే, కమిందు మెండిస్, జెఫ్రీ వాండర్సే, ధనంజయ, అసిత ఫెర్నాండో ఆడొచ్చు.

Story first published: Wednesday, August 7, 2024, 11:46 [IST]
Other articles published on Aug 7, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+