హైదరాబాద్: పాకిస్ధాన్‌తో జరిగే ఐదు వన్డేల సిరిస్ కోసం సెలక్టర్లు ప్రకటించిన జట్టులో శ్రీలంక పేసర్ లసిత్ మలింగకు చోటు దక్కలేదు. గాయం కారణంగా సుదీర్ఘ కాలం జట్టుకు దూరమై సెప్టెంబర్‌లో భారత్‌తో జరిగిన సిరిస్‌లో మలింగ పునరాగమనం చేసిన సంగతి తెలిసిందే.
భారత్‌తో జరిగిన సిరిస్‌లో మలింగ పెద్దగా ప్రభావం చూపలేదు. దీంతో పాక్‌తో జరగనున్న ఐదు వన్డేల సిరిస్‌లో మలింగకు ఉద్వాసన పలుకుతూ శ్రీలంక క్రికెట్ బోర్డు(ఎస్ఎల్సీ) సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. యూఏఈలో పాక్‌తో జరిగే ఐదు వన్డేల సరిస్‌కు అతడు దూరమయ్యాడు.

ఇదిలా ఉంటే ఇప్పటికే గాయం కారణంగా పాకిస్థాన్‌తో జరిగే రెండో టెస్టుకు దూరమైన మాజీ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్‌ను కూడా వన్డే సిరిస్‌కు ఎంపిక చేయలేదు. అతను ఇంకా గాయం నుంచి కోలుకోలేకపోవడంతో విశ్రాంతినిచ్చారు. ఈ మేరకు కాలి కండర గాయం నుంచి మాథ్యూస్ కోలుకోలేదని టీమ్ మేనేజ్‌మెంట్ తెలిపింది.
శ్రీలంక జట్టు: ఉపుల్ తరంగా(కెప్టెన్), దినేశ్ చండిమాల్, నిరోషాన్ డిక్ వెల్లా, లహిరు తిరుమన్నే, కుశాల్ మెండిస్, మిలిందా సిరివర్ధనే, చమర కపుగదెరా, తిషారా పెరీరా, సీక్కుజ్ ప్రసన్న, నువాన్ ప్రదీప్, సురంగా లక్మల్, దుస్మంత చమీరా, విశ్వ ఫెర్నెండో, అకిలా దనంజయ, జెఫ్రీ వాండ్రాసె