
హైదరాబాద్: క్రికెట్ తెలిసిన వారికి దక్షిణాఫ్రికా స్పిన్నర్ పాల్ ఆడమ్స్ గుర్తు ఉండే ఉంటాడు. సరిగ్గా 20 ఏళ్ల కిందట అతని విచిత్ర బౌలింగ్ యాక్షన్ క్రికెట్‌లో హాట్ టాపిక్‌గా మారాడు. శరీరాన్ని పూర్తిగా వంచి తల మీదుగా అతడు వేసే స్పిన్ అర్ధం కాక అప్పట్లో బ్యాట్స్‌మెన్లు తలలు బద్దలు కొట్టుకున్నారు.
మళ్లీ ఇన్నాళ్లకు అచ్చం అతనిలాగే శ్రీలంకకు చెందిన ఓ బౌలర్ తెరపైకి వచ్చాడు. ఈ బౌలర్ పేరు కెవిన్ కొత్తిగొడ. 18 ఏళ్ల ఈ కొత్తిగొడ కుడి చేతివాటం స్పిన్ బౌలర్. శ్రీలంకలోని గాలెకు చెందినవాడు. కౌలాలంపూర్ వేదికగా జరుగుతన్న ఆసియా కప్‌లో తెరపైకి వచ్చాడు.
కౌలాలంపూర్‌లో జరిగిన ఈ టోర్నీలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కెవిన్ బౌలింగ్ యాక్షన్ చూసి ఆ జట్టు బ్యాట్స్‌మెన్లు బెంబేలెత్తి పోయారు. ఆ మ్యాచ్‌లో 8 ఓవర్లు వేసి 29 పరుగులిచ్చిన కెవిన్.. ఒక వికెట్ తీశాడు. బౌలింగ్ వేసే సమయంలో కత్తిగొడ బౌలింగ్ చేస్తున్నాడా? లేదా యోగాసనం చేస్తున్నాడా అన్నది అర్ధం కావట్లేదు.
ఓ క్రికెట్ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్యూలో కొత్తగొడ మాట్లాడుతూ మొదట్లో తల పూర్తిగా కిందికి వంచడం వల్ల పిచ్ కనిపించక బౌలింగ్ వేయలేకపోయేవాడినని, ఇప్పుడు అలవాటైపోయిందని చెప్పాడు. కత్తిగొడ బౌలింగ్ యాక్షన్‌పై శ్రీలంక ఏ జట్టు మాజీ ఓపెనర్ దమ్మిక సుదర్శన మాట్లాడుతూ ఈ యాక్షన్‌పై అతడికి ఎవరూ కోచింగ్ ఇవ్వలేదని స్వతహాగా నేర్చుకున్నాడని తెలిపాడు.