Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మే 10వ తేదీలోగానే ఐపియల్ నుంచి శ్రీలంక కెప్టెన్ దిల్షాన్ ఔట్

Tillakaratne Dilshan
కొలంబో: శ్రీలంక క్రికెట్ జట్టు కొత్త కెప్టెన్ తిలక్‌రత్నే దిల్షాన్ ఐపియల్ నుంచి ముందుగానే తప్పుకుంటున్నాడు. రాయల్ చాలెంజర్స్ జట్టులో కీలక ఆటగాడైన దిల్షాన్ తన శ్రీలంక జట్టు సభ్యులతో పాటు ఇంగ్లాండు పర్యటనకు వెళ్లేందుకు ఆ నిర్ణయం తీసుకున్నాడు. శ్రీలంక జట్టు మే 10వ తేదీన ఇంగ్లాండుకు బయలుదేరి వెళ్తుంది. ఇంగ్లాండుతో శ్రీలంక జట్టు మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక ట్వంటీ20 మ్యాచు ఆడుతుంది.

దిల్షాన్ తన జట్టు సభ్యులతో పాటు ఇంగ్లాండు బయలుదేరి వెళ్లాలని భావిస్తున్నాడని, సీనియర్ ఆటగాళ్లతో సత్సంబంధాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నాడని దిల్షాన్ మేనేజర్ రోషన్ అబెయ్ సంఘే చెప్పారు. తన ఆటగాళ్లను మే 18వ తేదీ వరకు ఐపియల్‌లో ఆడడానికి అనుమతించింది. ప్రపంచ కప్ పోటీల్లో ఓడిపోవడంతో కెప్టెన్‌గా కుమార్ సంగక్కర తప్పుకున్నాడు. అతని స్థానంలో దిల్షాన్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+