Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

England vs Sri Lanka:చిక్కుల్లో శ్రీలంక క్రికెటర్లు.. మిడ్‌నైట్‌లో ఇదేం పని నాయనా (వీడియో)!!

Sri Lanka cricketers Niroshan Dickwella, Kusal Mendis breaching bio-bubble in England
Sri Lanka cricketers Kusal Mendis, Gunathilaka, Dickwella sent home after bio-bubble breach in UK

సౌతాంఫ్టన్: శ్రీలంక క్రికెట్ జట్టు ప్రస్తతం ఇంగ్లండ్ టూర్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్ పర్యటనలో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ ఆడేందుకు లంక వెళ్లింది. ఇప్పటికే మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ముగియగా.. మూడింటిలోనూ శ్రీలంక ఓడిపోయింది. ఇక ఇంగ్లండ్-శ్రీలంక మధ్య మంగళవారం తొలి వన్డే​ డర్హమ్​లో జరగనుంది. ఇరు జట్లు టీ20 మ్యాచ్​లు ఆడిన కార్డిఫ్​లో ఆటగాళ్లను బయట తిరిగేందుకు అనుమతి ఇచ్చారు. కానీ డర్హమ్​లో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ ఆటగాళ్లు బయోబబుల్​కే పరిమితమవ్వాలని అధికారులు ఆదేశించారు.

మిడ్‌నైట్‌లో వీధుల్లోకి:

అధికారుల మాటలు ఏమాత్రం ఖాతరు చేయకుండా.. శ్రీలంక వైస్ కెప్టెన్ కుశాల్ మెండిస్, వికెట్ కీపర్ నిరోషాన్ డిక్వెల్లా బయో బబుల్ నిబంధనల్ని అతిక్రమించారు. ఇద్దరూ జట్టు బస చేసిన హోటల్ నుంచి వెలుపలికి వచ్చి ఓ స్ట్రీట్‌లో కెమెరాకి చిక్కారు. ఓ వ్యక్తి మొబైల్‌తో తమని వీడియో తీస్తుండటాన్ని గమనించిన డిక్విల్వా.. కుశాల్‌ని అలెర్ట్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే సిగరెట్ తాగేందుకు సిద్ధమైన కుశాల్.. ఆలస్యంగా విషయం తెలుసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. లంక క్రికెటర్లు ఇద్దరు బయట తిరుగుతూ కనిపించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

సమగ్ర విచారణ:

సమగ్ర విచారణ:

కుశాల్ మెండిస్, నిరోషాన్ డిక్వెల్లాలకు సంబందించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. వారు మాస్క్​ కూడా పెట్టుకోకపోవడం చర్చకు దారితీసింది. దీనిపై స్పందించిన నెటిజన్లు బయోబబుల్​లో ఉండాల్సిన ఆటగాళ్లు బయటకు ఎందుకు వచ్చారంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక నిబంధనల్ని అతిక్రమించి సంచరించడంపై శ్రీలంక క్రికెట్ చీఫ్ షమ్మి సిల్వా సీరియస్ అయ్యాడు. ఈ ఘటనపై విచారణకి ఆదేశించినట్లు వెల్లడించాడు. అలానే శ్రీలంక టీమ్ మేనేజర్‌ మంజు కూడా ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు వెల్లడించాడు.

రూల్స్‌ బ్రేక్ చేసినట్టు తేలితే:

రూల్స్‌ బ్రేక్ చేసినట్టు తేలితే:

విచారణలో ఒకవేళ కుశాల్ మెండిస్, నిరోషాన్ డిక్వెల్లా ఇద్దరు బయో బబుల్ రూల్‌ని బ్రేక్ చేసినట్లు తేలితే.. మళ్లీ క్వారంటైన్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. 7 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండి కరోనా వైరస్ పరీక్షల అనంతరం టీమ్‌తో చేరాల్సి ఉంటుంది. జులై 4న మూడో వన్డేతో ఇంగ్లండ్ గడ్డపై శ్రీలంక పర్యటన ముగియనుంది. శ్రీలంక క్రికెటర్లు బబుల్ రూల్స్‌ని బ్రేక్ చేసినట్టు తేలితే.. వన్డేలకు దాదాపు దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇదే జరిగితే లంకకు భారీ ఎదురుదెబ్బ తగులుతుంది. ఎందుకంటే.. ఇప్ప్పటికే టీ20 సిరీస్ కోల్పోయిన లంకకు వీరి సేవలు కూడా దూరమయితే గెలవడం కష్టమే.

రిఫరీకి కరోనా:

రిఫరీకి కరోనా:

మరోవైపు శనివారం ఇరు జట్ల మధ్య జరిగిన మూడో టీ20లో మ్యాచ్ రిఫరీ ఫిల్​ విట్టికేస్​ పాల్గొన్నాడు. అతడికి ఆదివారం కరోనా నిర్ధరణ అయింది. మ్యాచ్ రిఫరీకి మహమ్మారి లక్షణాలేమీ లేనప్పటికీ వైరస్​ బారిన పడ్డారని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. రిఫరీ ఫిల్​ విట్టికేస్ ప్రస్తుతం బాగానే ఉన్నాడని, అతడు​ 10 రోజులు క్వారంటైన్‌లో ఉంటాడని ఈసీబీ తెలిపింది. మ్యాచ్ సమయంలో అధికారులు మరియు అవినీతి నిరోధక యూనిట్ సభ్యులు ఏడుగురు అతడితో సన్నిహితంగా ఉన్నారట. దాంతో వారందరు కూడా 10 రోజులు క్వారంటైన్‌లో ఉండనున్నారు.

Story first published: Monday, June 28, 2021, 21:42 [IST]
Other articles published on Jun 28, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+