కొలంబో : శ్రీలంక క్రికెటర్ నువాన్ కులశేఖరను (34) అరెస్టు చేశారు అక్కడి పోలీసులు. తన కారుతో బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తిని ఢీ కొట్టడంతో.. అతను అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. దీంతో పోలీసులు కులశేఖరను అదుపులోకి తీసుకున్నారు. కొలంబోకు 15కి.మీల దూరంలో ఉన్న కదావాతా -1 రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది.
కాగా, అరెస్టయిన కాసేపటికే బెయిల్ పై విడుదలయ్యాడు కులశేఖర. అత్యంత రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో కులశేఖర డ్రైవింగ్ వల్లే ద్విచక్ర వాహనదారుడు ప్రాణాలు కోల్పోయాడని తెలుస్తోంది. తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మృతిచెందాడు. రోజురోజుకు పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాల పట్ల అక్కడి పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గతేడాది మొత్తం 2700 మంది రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. ఆశ్చర్యం కలిగించే విషయమేంటంటే.. ఇందులో సగాని పైగా రోడ్డు ప్రమాదాలు ఏ-1 రహదారిపై చోటు చేసుకున్నవే.