మ్యాచ్ ఫిక్సింగ్ ఎలా చేయాలో వివరిస్తున్న మాజీ క్రికెటర్

హైదరాబాద్: పిచ్ ఫిక్స్‌పై తమ కూలంకుషగా జరిపిన పరిశోధనను అల్‌జజీరా ఆదివారం ప్రసారం చేయనుంది. దానికి సంబంధించిన వివరాలను శనివారం తన వెబ్‌సైట్‌లో ఉంచడంతో అది తీవ్ర చర్చనీయాంశమైంది. బెట్టింగ్‌ల ద్వారా భారీగా ఆర్జించడం కోసం గాలె స్టేడియం గ్రౌండ్స్‌మన్‌కు తాను లంచం ఇచ్చి పిచ్‌ను తనకు అనుకూలంగా మార్చుకున్నట్లు మ్యాచ్ ఫిక్సర్‌గా మారిన ముంబై మాజీ క్రికెటర్ రాబిన్ మోరిస్ ఆల్‌జజీరా ఛానెల్‌తో చెప్పాడు.
గాలె స్టేడియంలో 2016 ఆగస్టులో ఆస్ట్రేలియా, శ్రీలంక.. నిరుడు భారత్, శ్రీలంక (తొలి టెస్టు) మధ్య మ్యాచ్‌ల పిచ్‌ను ఫిక్స్ చేసినట్లు అంగీకరించాడు. ఈ ఏడాది నవంబరులో గాలెలో ఇంగ్లాండ్‌తో మ్యాచ్ పిచ్‌ను మార్చే యోచనలో ఉన్నట్లు వెల్లడించాడు. గాలె స్టేడియం అసిస్టెంట్ మేనేజర్, గ్రౌండ్స్‌మన్ తరంగ ఇండిక అందుకు సహకరిస్తాడని.. తమని ఫిక్సర్లుగా పరిచయం చేసుకున్న అల్‌జజీరా రిపోర్టర్లతో అతడు చెప్పాడు.

గత మ్యాచ్‌ల్లో ఫిక్సింగ్‌కు పాల్పడ్డ విధానం:
పిచ్‌ను ఎలా కావాలంటే అలా రూపొందించడం చాలా సులువని, గత మ్యాచ్‌ల్లో ఎలా పిచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడో వివరంగా తెలిపాడు తరంగ. ‘ఆస్ట్రేలియాతో మ్యాచ్ కోసం బౌలింగ్ పిచ్‌ను తయారు చేశా. మ్యాచ్‌లో కచ్చితంగా ఫలితం వచ్చేలా చెత్తగా రూపొందించా. అసలు రోలర్‌ను వాడలేదు. స్పిన్నర్లు విజృంభించిన ఆ మ్యాచ్ కేవలం రెండున్నర రోజుల్లో ముగిసింది' అని చెప్పాడు.
బ్యాట్స్‌మెన్ ద్వారా భారీగా సంపాదించవచ్చని
బ్యాట్స్‌మెన్ ఇబ్బందిపడతారని ముందే తెలుసుకోవడం ద్వారా భారీగా ఆర్జించొచ్చని మోరిస్ చెప్పాడు. ఇక నిరుడు భారత్, శ్రీలంక మధ్య మ్యాచ్ గురించి తరంగ చెబుతూ.. ‘భారత్‌తో మ్యాచ్ కోసం బ్యాటింగ్ పిచ్‌ను తయారుచేశాం. రోలర్ ఉపయోగించి, ఆ తర్వాత నీళ్లు పోసి పిచ్‌ను గట్టిగా మార్చాం' అని అన్నాడు.

పిచ్‌కు సంబంధించిన సమాచారం ముందే చెబుతా:
ఇలా చేయడం ద్వారా తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు నమోదవుతుంది. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 600 పరుగులు చేసింది. ‘పిచ్‌కు సంబంధించిన సమాచారం నేను ముందే చెబుతాను. మీరు అందుకు తగ్గట్టుగా బెట్టింగ్‌కు వేసుకోవచ్చు' అని మోరిస్ రిపోర్టర్లతో చెప్పాడు.

డబ్బు అవసరం లేదని.. మొత్తంలో 30 శాతం ఇస్తే చాలని
సమాచారం ఇస్తున్నందుకు తనకు డబ్బు అవసరం లేదని.. ఆర్జించే మొత్తంలో 30 శాతం ఇస్తే చాలని అతడు బేరసారాలకు దిగడం విశేషం. 42ఏళ్ల మోరిస్ ముంబై తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడాడు. పిచ్ ఫిక్స్ ఉదంతంపై ఐసీసీ ఇప్పటికే విచారణను ఆరంభించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications