Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీ20 ప్రపంచకప్‌లో మహిళపై రేప్ - స్టార్ క్రికెటర్‌‌పై వేటు: అన్ని ఫామ్స్ నుంచీ..!!

Sri Lanka Cricket decided to suspend rape accused Danushka Gunathilaka from all forms of cricket

కొలంబో: శ్రీలంక స్టార్ క్రికెటర్ ధనుష్క గుణతిలక అరెస్ట్ అయ్యాడు. ఆస్ట్రేలియా పోలీసులు అతణ్ని కటకటాల వెనక్కి నెట్టారు. ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలను ఎదుర్కొంటోన్నాడు ధనుష్క.

అతను అరెస్టయిన విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డ్ కూడా నిర్ధారించింది. సోమవారం అతణ్ని న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. ఈ విషయంలో ఆస్ట్రేలియా పోలీసులకు తాము అన్ని రకాలుగా సహకరిస్తామని వివరించింది.

హోటల్‌లో అత్యాచారం..

హోటల్‌లో అత్యాచారం..

టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌లో ఆడటానికి జట్టుతో పాటు ఆస్ట్రేలియాకు వెళ్లాడు ధనుష్క గుణతిలక. గ్రూప్స్ దశ మ్యాచ్‌ ఆడుతూ గాయపడ్డాడు. హ్యామ్‌ స్ట్రింగ్ గాయం వల్ల సూపర్ 12 మ్యాచ్‌లల్లో ఆడట్లేదు. అతని స్థానంలో మరో ప్లేయర్‌‌ను ఆస్ట్రేలియాకు పంపించింది శ్రీలంక క్రికెట్ బోర్డ్. ధనుష్కను వెనక్కి పిలిపించుకోలేదు. జట్టుతో పాటే ఆస్ట్రేలియాలో ఉంటోన్నాడు. తాను బస చేసిన సిడ్నీ సెంట్రల్ డిస్ట్రిక్ట్‌ పరిధిలోని ఓ హోటల్‌లో 29 సంవత్సరాల మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదులు అందాయి.

పోలీసుల అదుపులో..

పోలీసుల అదుపులో..

ధనుష్క గుణతిలకకు ఆన్‌లైన్ డేటింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా బాధిత మహిళ పరిచయమైంది. ఈ నెల 2వ తేదీన న్యూ సౌత్ వేల్స్‌లోని ఓ హోటల్‌లో ఆమెను కలుసుకున్నాడు. ఆ సమయంలో ధనుష్క తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు న్యూ సౌత్ వేల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును నమోదు చేసిన పోలీసులు శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఒంటిగంట సమయంలో సస్సెక్స్‌ స్ట్రీట్‌లోని ఓ హోటల్‌లో అరెస్ట్ చేశారు. సిడ్నీ సిటీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అన్ని ఫార్మట్ల నుంచి సస్పెన్షన్..

అన్ని ఫార్మట్ల నుంచి సస్పెన్షన్..

ఈ ఘటనపై శ్రీలంక క్రికెట్ బోర్డ్ స్పందించింది. ధనుష్క గుణతిలక కఠిన చర్యలకు దిగింది. అతనిపై వేటు వేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఎగ్జిక్యూటివ్ కమిటీ చేసిన సిఫారసు మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వివరించింది. అతని సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. గుణతిలక పేరును ఎలాంటి సెలెక్షన్స్‌కు కూడా పరిగణనలోకి తీసుకోబోమని, ఈ సమాచారాన్ని అన్ని స్థాయిల్లో ఉన్న క్రికెట్ అసోసియేషన్లకు పంపిస్తామని పేర్కొంది.

నో బెయిల్..

నో బెయిల్..

దోషిగా తేలితే ధనుష్కపై భారీ జరిమానా సైతం విధించడానికి వెనుకాడబోమని శ్రీలంక క్రికెట్ బోర్డ్ స్పష్టం చేసింది. కాగా- ధనుష్క గుణతిలకను పోలీసులు సోమవారం స్థానిక కోర్టులో ప్రవేశపెట్టారు. సర్రీ హిల్స్ జైలు నుంచి డౌనింగ్ సెంటర్ లోకల్ కోర్టులో వీడియో లింక్ ద్వారా వర్చువల్ విధానంలో విచారణకు హాజరయ్యారు. అతని తరఫు న్యాయవాది ఆనంద అమర్‌నాథ్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. మెజిస్ట్రేట్ రాబర్ట్ విలియమ్స్ నిరాకరించారు.

Story first published: Monday, November 7, 2022, 13:29 [IST]
Other articles published on Nov 7, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+