Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీ20 ప్రపంచకప్‌లో స్టార్ క్రికెటర్ అరెస్ట్‌- డేటింగ్ యాప్‌లో పరిచయమైన మహిళపై రేప్

Sri Lanka Cricket board confirmed that Danushka Gunathilaka has been arrested

కొలంబో: శ్రీలంక స్టార్ క్రికెటర్ ధనుష్క గుణతిలక అరెస్ట్ అయ్యాడు. ఆస్ట్రేలియా పోలీసులు అతణ్ని కటకటాల వెనక్కి నెట్టారు. ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలను ఎదుర్కొంటోన్నాడు ధనుష్క. అతను అరెస్టయిన విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డ్ కూడా నిర్ధారించింది. సోమవారం అతణ్ని న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. ఈ విషయంలో ఆస్ట్రేలియా పోలీసులకు తాము అన్ని రకాలుగా సహకరిస్తామని వివరించింది.

టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌లో ఆడటానికి జట్టుతో పాటు ఆస్ట్రేలియాకు వెళ్లాడు ధనుష్క గుణతిలక. గ్రూప్స్ దశ మ్యాచ్‌ ఆడుతూ గాయపడ్డాడు. హ్యామ్‌స్ట్రింగ్ గాయం వల్ల సూపర్ 12 మ్యాచ్‌లల్లో ఆడట్లేదు. అతని స్థానంలో మరో ప్లేయర్‌‌ను ఆస్ట్రేలియాకు పంపించింది శ్రీలంక క్రికెట్ బోర్డ్. ధనుష్కను వెనక్కి పిలిపించుకోలేదు. జట్టుతో పాటే అతను ఆస్ట్రేలియాలో ఉంటోన్నాడు. 2015లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెట్టాడీ స్టార్ బ్యాటర్. ఇప్పటివరకు ఎనిమిది టెస్ట్, 47 వన్డే, 46 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడాడు.

సూపర్ 12లో భాగంగా శనివారం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్‌లో ఇంగ్లాండ్‌తో శ్రీలంక ఆడిన మ్యాచ్ తరువాత అతను ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు అందాయి. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో ధనుష్క ఆడలేదు. తుదిజట్టులో అతనికి చోటు దక్కలేదు. ఆ సమయంలో అతను సిడ్నీ సెంట్రల్ డిస్ట్రిక్ట్‌ పరిధిలోని ఓ హోటల్‌లో బస చేశాడు. 29 సంవత్సరాల వయస్సున్న మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

బాధిత మహిళతో ధనుష్క గుణతిలకెకు ఆన్‌లైన్ డేటింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా పరిచయమైంది. ఈ నెల 2వ తేదీన న్యూ సౌత్ వేల్స్‌లోని ఓ హోటల్‌లో కలుసుకున్నారు. ఆ సమయంలో ధనుష్క తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె న్యూ సౌత్ వేల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును నమోదు చేసిన పోలీసులు శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఒంటిగంట సమయంలో సస్సెక్స్‌ స్ట్రీట్‌లోని ఓ హోటల్‌లో అరెస్ట్ చేశారు. సిడ్నీ సిటీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అతని వద్ద నుంచి నమూనాలను సేకరించారు.

Story first published: Sunday, November 6, 2022, 11:23 [IST]
Other articles published on Nov 6, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+