గాలె వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్‌పై శ్రీలంక సంపూర్ణ ఆధిపత్యం చెలాయిస్తోంది. తొలుత బ్యాటుతో, తర్వాత బంతితో చెలరేగి రికార్డులు సాధిస్తోంది. ఓవర్‌నైట్ స్కోరు 22/2తో మూడో రోజు ఆట ఆరంభించిన కివీస్.. ప్రభత్ జయసూర్య (6/42) ధాటికి 39.5 ఓవర్లలోనే 88 పరుగులకు కుప్పకూలింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో లంకు 514 పరుగులు భారీ ఆధిక్యం దక్కింది.
ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో అత్యధిక ఆధిక్యాన్ని దక్కించుకున్న అయిదో జట్టుగా శ్రీలంక చరిత్ర సృష్టించింది. ఈ జాబితాతో ఇంగ్లండ్ (702 పరుగుల ఆధిక్యం, ఆస్ట్రేలియాపై- 1938లో) తొలిస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో దక్షిణాఫ్రికా (587 పరుగుల ఆధిక్యం, శ్రీలంకపై- 2006లో), పాకిస్థాన్ (570 పరుగుల ఆధిక్యం, న్యూజిలాండ్‌పై- 2002లో), ఇంగ్లండ్ (563 పరుగుల ఆధిక్యం, వెస్టిండీస్‌పై - 1930లో), శ్రీలంక (514) వరుసగా ఉన్నాయి.

న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాటర్లు మాత్రమే రెండంకెల స్కోరు అందుకున్నారు. మిచెల్ శాంట్నర్ (29) టాప్ స్కోరర్. జయసూర్య ఆరు వికెట్లు, నిశాన్ మూడు, అసిత ఫెర్మాండో ఒక వికెట్ తీశారు. లంక బౌలింగ్ దళంలో ఈ ముగ్గురే బంతిని అందుకున్నారు. ఇతర బౌలర్లు బౌలింగ్‌కు రాకముందే కివీస్ కథ ముగిసింది. కాగా, ఫాలో ఆన్‌తో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఖాతా తెరవకముందే ఓపెనర్ టామ్ లాథమ్ వికెట్ కోల్పోయింది.
అంతకుముందు శ్రీలంక 163.4 ఓవర్లలో అయిదు వికెట్లకు 602 పరుగుల భారీ స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. లంక రైజింగ్ స్టార్ (182 నాటౌట్) అజేయ భారీ శతకంతో చెలరేగాడు. కుశాల్ మెండిస్ (106 నాటౌట్), చండిమాల్ (116) సెంచరీల మోత మోగించారు. మాథ్యూస్ (66), కరుణరత్నె (46) పరుగులు సాధించారు. న్యూజిలాండ్ బౌలర్లలో గ్లెన్ ఫిలిప్స్ మూడు వికెట్లు తీశాడు. ఈ రెండు టెస్టుల సిరీస్‌లో తొలి టెస్టును లంక 63 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.