Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లంక కోచ్, కెప్టెన్, మేనేజర్‌లకు తప్పని సస్పెన్షన్

Sri Lanka Captain, Coach And Manager Suspended
Sri Lanka captain, coach and manager suspended for four ODIs along with two Tests

హైదరాబాద్: శ్రీలంక కెప్టెన్‌ చండిమాల్‌, కోచ్‌ హతురుసింగ, మేనేజర్‌ గురుసిన్హాలపై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) కఠిన చర్యలు తీసుకుంది. గత నెల వెస్టిండీస్‌తో టెస్టు సందర్భంగా చండిమాల్‌ బాల్‌ టాంపరింగ్‌ చేసినట్లు అంపైర్లు ఫిర్యాదు చేయగా.. నిరసనగా లంక జట్టు మైదానానికి రావడానికి నిరాకరించింది. దీంతో ఆట రెండున్నర గంటలు ఆలస్యమైంది.

బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడటంతో

బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడటంతో

వెస్టిండీస్‌ పర్యటనలో బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడటంతో పాటు మైదానంలో దిగేందుకు ఆలస్యం చేసి క్రికెట్‌ను అపహాస్యం చేసినందుకు ఐసీసీ... లంక కెప్టెన్ దినేశ్‌ చండిమాల్, కోచ్‌ చండిక హతురుసింఘే, మేనేజర్‌ అసంక గురుసిన్హాలపై సస్పెన్షన్‌ వేటు వేసింది. ఏకంగా నాలుగు వన్డేలు, రెండు టెస్టుల నిషేధం విధించింది.

మైదానంలో దిగేందుకు ససేమిరా

మైదానంలో దిగేందుకు ససేమిరా

గత నెల సెయింట్‌ లూసియాలో జరిగిన టెస్టులో లంక బంతి ఆకారాన్ని దెబ్బతీసింది. ఫీల్డ్‌ అంపైర్లు బంతిని మారుస్తామన్నందుకు మైదానంలో దిగేందుకు ససేమిరా అన్నారు. చివరకు మ్యాచ్‌ రిఫరీ జవగళ్‌ శ్రీనాథ్‌ జోక్యంతో మ్యాచ్‌ ఆడారు.

వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆరు గంటలు

వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆరు గంటలు

ఈ మొత్తం ఉదంతంలో తప్పుతేలడంతో ఇదివరకే చండిమాల్‌ టెస్టు మ్యాచ్‌ నిషేధానికి గురయ్యాడు. కాగా... క్రికెట్‌ క్రీడ ఔన్నత్యం కాపాడేందుకు ఐసీసీ చేపట్టిన స్వతంత్ర దర్యాప్తులో క్రీడాస్ఫూర్తికి విఘాతం కలిగించేలా లంక వర్గాలు నడుచుకున్నాయని విచారణ కమిషనర్‌ మైకేల్‌ బిలాఫ్‌ తేల్చారు. దీంతో సోమవారం శిక్ష ఖరారు చేశారు. ఈ నెల 11న వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆరు గంటల పాటు లంక, విండీస్‌ల వాదనలు విన్న ఆయన తీర్పును రిజర్వ్‌లో ఉంచారు.

దక్షిణాఫ్రికాతో ఆడబోయే మ్యాచ్‌లకు

సోమవారం వెలువరించిన తీర్పులో క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు వీరిపై 8 చొప్పున సస్పెన్షన్‌ పాయింట్లు విధించింది ఐసీసీ. దీని ప్రకారం ఆరు (4+2) మ్యాచ్‌లు సస్పెండ్‌ అయ్యా రు. దీంతో చండిమాల్‌ ఈ నెల 29, ఆగస్టు 1, 5, 8 తేదీల్లో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరగబోయే మొదటి నాలుగు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లకు వీళ్లు దూరం కానున్నారు.

Story first published: Tuesday, July 17, 2018, 10:49 [IST]
Other articles published on Jul 17, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+