
అంతర్జాతీయ క్రికెట్‌కు శ్రీలంక స్టార్ బౌలర్ దిల్రువాన్ పెరీరా గుడ్‌బై చెప్పాడు. ఈ మేరకు 39 ఏళ్ల స్పిన్నర్ దిల్రువాన్ పెరీరా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు సీఈఓ ఆష్లే డి సిల్వాకు ఈమెయిల్ ద్వారా తెలిపాడు. 2007 నుంచి 2021 వరకు 15 ఏళ్లపాటు అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడిన పెరీరా.. శ్రీలంక టెస్టు జట్టులో కీలక పాత్ర పోషించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో శ్రీలంక తరఫున పెరీరా పలు రికార్డులను సృష్టించాడు. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లో అత్యంత వేగంగా శ్రీలంక తరఫున 50 వికెట్లు, 100 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లో ఒకే మ్యాచ్‌లో 10 వికెట్లు, హాఫ్ సెంచరీ చేసిన ఒకే ఒక్క శ్రీలంక ఆటగాడిగా దిల్రువాన్ పెరీరా అరుదైన ఘనత సాధించాడు. అంతేకాకుండా అంతర్జాతీయ క్రికెట్‌లో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఐదో బౌలర్‌గా నిలిచాడు.
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించినప్పటికీ, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో కొనసాగుతానని పెరీరా ప్రకటించాడు. ఇన్నేళ్ల క్రికెట్ కెరీర్‌లో అత్యుత్తమ ఆటగాళ్లతో కలిసి ఆడానని దిల్రువాన్ పెరీరా గుర్తు చేసుకున్నాడు. అనేక మధుర జ్ఞాపకాలు, సంతోషంతో కూడిన హృదయంలో క్రికెట్‌కు వీడ్కోలు చెబుతున్నట్టు చెప్పుకొచ్చాడు. కెరీర్‌లో 43 టెస్టు మ్యాచ్‌లు ఆడిన దిల్రువాన్ పెరీరా.. 161 వికెట్లు తీశాడు. ఓ ఇన్నింగ్స్‌లో పెరీరా అత్యధిక గణాంకాలు 6/32 కాగా.. మ్యాచ్‌లో 10/78 గా ఉన్నాయి. అంతేకాకుండా 18 సగటుతో 1303 పరుగులు చేశాడు. 7 సార్లు హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. పాకిస్థాన్‌పై చేసిన 95 పరుగులు కెరీర్‌లో అత్యధిక స్కోర్. ఇక 13 వన్డే మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీశాడు. అత్యుత్తమ గణాంకాలు 3/48. ఇక 3 టీ20ల్లో 3 వికెట్లు తీశాడు. అత్యత్తుమ గణాంకాలు 3/26. అలాగే 200కు పైగా ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 800 వికెట్లు తీశాడు.
2007 అక్టోబర్ 13న ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా పెరీరా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఇక చివరి వన్డే మ్యాచ్‌ను 2018లో సెప్టెంబర్ 15న బంగ్లాదేశ్‌తో ఆడాడు. ఇక తొలి టెస్టు మ్యాచ్‌ను 2014 జనవరి 16న పాకిస్థాన్‌తో ఆడాడు. అలాగే చివరి టెస్ట్ మ్యాచ్‌ను 2021 జనవరి 22న ఇంగ్లండ్‌తో ఆడాడు. ఇక 2011లో ఆగష్టు 6న తొలి టీ20 మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఆడాడు. అదే ఏడాది నవంబర్ 25న పాకిస్థాన్‌తో ఆడాడు.