మాకిది చాలా బాధాకరమైన రోజు: జయవర్ధనే

శ్రీలంక రాజధాని కొలంబోలో ఈస్టర్ ప్రార్థనల తరుణంలో ఆదివారం ఉదయం మూడు చర్చిలు, మూడు హోటళ్లలో పేలుళ్లు జరిగాయి. మొత్తం ఎనిమిది చోట్ల జరిగిన పేలుళ్లలో 200 మందికి పైగా మరణించగా.. 400 మందికి గాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు. శ్రీలంకలో జరిగిన ఈ దారుణ ఘటనలను యావత్ క్రీడా ప్రపంచం ఖండించింది. దిగ్గజ ఆటగాళ్లతో సహా ప్రస్తుత ఆటగాళ్లు కూడా సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం తెలిపారు.
మహేలా జయవర్ధనే: 'మాకిది చాలా బాధాకరమైన రోజు. 10 సంవత్సరాల పాటు శాంతియుతంగా ఉన్న దేశంలో మరోసారి దాడులు జరిగాయి. ప్రాణాలు కోల్పోయిన వారికి నా సానుభూతి. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను'.
శిఖర్ ధావన్: 'గుండె పగిలినంత బాధగా ఉంది. ఇలాంటి ఘటనలు జరగడం దారుణం. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి'.
విరాట్ కోహ్లీ: 'శ్రీలంకలో పేలుళ్ల ఘటన జరిగిందనే వార్త విని షాకయ్యాను. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి నా సంతాపం. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలి ప్రార్థిస్తున్నా'.
సచిన్: 'లంకలో దాడులు జరిగాయని తెలిసి ఎంతో బాధపడ్డా. ఈ తీవ్రవాద ఘటనలను ఖండించాలి. ప్రేమ, దయ మరియు కరుణను హింసాత్మక ఘటనలు జయించలేవు'.
సానియా మీర్జా: 'ప్రపంచ వ్యాప్తంగా ఏం జరుగుతోంది. దేవుడు అందర్నీ కాపాడాలి'.
వీవీఎస్ లక్ష్మణ్: 'శ్రీలంకలో దాడి తెలిసి చాలా బాధ పడ్డా. శ్రీలంక దేశ ప్రజలకు నా ప్రగాఢ సానుభూతి. పేలుళ్లలో గాయపడిన వాళ్లందరూ త్వరగా కోలుకోవాలి'.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications