Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

1-1తో డ్రా: తొలి ఆసియా దేశంగా చరిత్ర సృష్టించిన శ్రీలంక

Sri Lanka beat West Indies by four wickets to draw Test series 1-1

హైదరాబాద్: తాత్కాలిక కెప్టెన్ సురంగ లక్మల్ నేతృత్వంలోని శ్రీలంక జట్టు చరిత్ర సృష్టించింది. కరేబియన్ గడ్డపై వెస్టిండీస్‌తో జరిగిన మూడో టెస్టులో నాలుగు వికెట్ల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌ 1-1తో డ్రాగా ముగిసింది.

అంతేకాదు, పేస్‌కు స్వర్గధామమైన కింగ్‌స్టన్‌ ఓవల్‌ మైదానంలో గెలిచిన తొలి ఆసియా దేశంగా శ్రీలంక చరిత్ర సృష్టించింది. పలుమార్లు వర్షం అంతరాయం కలిగించిన ఈ డే/నైట్‌ టెస్టులో చివరకు విజయం శ్రీలంకనే వరించింది. 144 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన శ్రీలంకను జాసన్ హోల్డర్‌ దెబ్బతీశాడు.


వరుసగా వికెట్లు తీస్తూ పర్యాటక జట్టును తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాడు. దీంతో ఒకానొక దశలో శ్రీలంక 81 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో పెరీరా(23 నాటౌట్‌), కుశాల్‌ పెరీరా(28 నాటౌట్‌) నిలకడగా ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

రెండో ఇన్నింగ్స్‌లో హోల్డర్‌ ఐదు వికెట్లు తీయగా... కీమర్‌ రోచ్‌కు ఒక్క వికెట్‌ దక్కింది. మూడో టెస్టులో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్న వెస్టిండిస్ కెప్టెన్‌ జాసన్‌ హోల్డర్‌కు 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌', సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన విండీస్‌ కీపర్‌ షేన్‌ డౌరిచ్‌కు 'ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌' అవార్డులు లభించాయి.

Story first published: Wednesday, June 27, 2018, 12:28 [IST]
Other articles published on Jun 27, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+