For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఏకైక టీ20లో లంకదే విజయం

Sri Lanka beat South Africa by 3 wickets in the only T20I match

కొలంబో: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ను చేజార్చుకున్న శ్రీలంక పొట్టి ఫార్మాట్‌లో పైచేయి సాధించింది. దక్షిణాఫ్రికాతో ఏకైక టీ20లో ఆతిథ్య శ్రీలంక 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య మంగళవారం జరిగిన ఏకైక టీ20లో సఫారీలపై విజయం సాధించి కప్‌ను కైవసం చేసుకుంది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 99 పరుగుల లక్ష్యాన్ని లంక 16 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి విజయాన్నందుకుంది.

6 పరుగులకే ఓపెనర్లు కుశాల్ పెరీరా(3), మెండిస్(1) వికెట్లు కోల్పోయిన జట్టును చంఢీమాల్(36), డిసిల్వా(31) ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 53 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టు గెలుపునకు బాట వేశారు. తొలుత దక్షిణాఫ్రికా సందకన్‌ (3/19), అకిల ధనంజయ (2/15), ధనంజయ డిసిల్వా (2/15) విజృంభించడంతో 16.4 ఓవర్లలో 98 పరుగులకే ఆలౌటైంది.

టాప్‌ స్కోరర్‌ ఓపెనర్ డికాక్(20), హెన్రిక్స్(19), క్లాసెన్(18) మినహా అందరూ విఫలమయ్యారు. నలుగురు డకౌట్‌గా వెనుదిరిగారు. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన ధనంజయకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. లక్ష్యాన్ని శ్రీలంక 16 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చంఢీమాల్‌ 36 పరుగులతో అజేయంగా నిలిచాడు.

1
43568

ఆదివారం ఫిబ్రవరి 12తో ముగిసిన ఐదు వన్డేల సిరీస్‌లో ఆఖరి మ్యాచ్ లంక గెలిచినా సిరీస్‌ను మాత్రం దక్షిణాఫ్రికానే గెలిచింది. ఆఖరి మ్యాచ్‌కు ముందే మూడు గెలిచి ఆధిక్యంలో ఉండడంతో ఆఖరి మ్యాచ్‌లో అలసత్వం ప్రదర్శించి అటు బ్యాటింగ్.. ఫీల్డింగ్.. బౌలింగ్‌లలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

Story first published: Wednesday, August 15, 2018, 11:13 [IST]
Other articles published on Aug 15, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+