శ్రీలంక టీంలో ప్రధాన మార్పు: కోచ్‌ను మార్చేశారు

హైదరాబాద్: లంక జట్టుకు ప్రధాన కోచ్‌గా చండికా హతురసింఘను లంక క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. డిసెంబర్ 20 నుంచి అతని నియామకం అమల్లోకి వస్తుందని లంక క్రికెట్ బోర్డు వెల్లడించింది. 2006-09 కాలానికి హతురసింఘ.. శ్రీలంక-ఎ జట్టుకు ప్రధాన కోచ్‌గా పని చేశాడు. 2009-10లో అతను జాతీయ జట్టుకు కూడా తెర వెనుక కోచ్‌గా వ్యవహరించాడు.
ఈ జూన్‌లో ప్రధాన కోచ్ పదవి నుంచి గ్రాహం ఫోర్డ్ రాజీనామా చేసిన తర్వాత అతని స్థానాన్ని భర్తీ చేయడం కోసం లంక ప్రయత్నాలు మొదలుపెట్టింది. హతురసింఘ లంక తరఫున 26 టెస్టులు, 35 వన్డేలు ఆడాడు. శ్రీలంక జట్టుకు ఈ ఏడాది అంతగా కలిసి రాలేదు. అందుకే జట్టులో మార్పులు చేసే దిశగా యోచిస్తోంది. ఈ నేపథ్యంలో జట్టులో కీలక మార్పులు చేయనున్నట్లు సమాచారం.
భారత్‌తో వన్డే మ్యాచ్ ఆడేందుకు బయల్దేరిన ఆరుగురు ఆటగాళ్లను అక్కడి క్రీడా మంత్రి దయసిరి జయశేఖర ఆపివేసిన సంగతి విదితమే.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications