టెస్ట్ ఛాంపియన్‌షిప్: పాక్ పర్యటనకు వెళ్లే శ్రీలంక జట్టు ఇదే!

హైదరాబాద్: పాకిస్థాన్ పర్యటనకు వెళ్లే పూర్తి స్థాయి టెస్టు జట్టుని శుక్రవారం శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. మొత్తం 16 మంది సభ్యులతో కూడిన జట్టుకు దిముత్ కరుణరత్నే నాయకత్వం వహించనున్నాడు. ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ కోసం శ్రీలంక జట్టు డిసెంబర్ 9న పాక్‌కు బయల్దేరనుంది.
న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో చోటు దక్కించుకున్న దినేష్ చండిమాల్‌కు తుది జట్టులో చోటు దక్కని సంగతి తెలిసిందే. అయినా సరే, పాకిస్థాన్‌తో సిరిస్‌కు సెలక్టర్లు అతడిని ఎంపిక చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి 12 నెలలు సస్పెన్షన్‌కు గురైన అకిల ధనుంజయ స్థానంలో సెలక్టర్లు కాసున్ రజితకు చోటు కల్పించారు.

డిసెంబర్ 11 నుంచి 15 వరకు తొలి టెస్టు
ఈ పర్యటనలో భాగంగా డిసెంబర్ 11 నుంచి 15 వరకూ రావల్పిండిలో తొలి టెస్టు జరుగనుండగా, డిసెంబర్ 19నుంచి 23 వరకూ కరాచీలో రెండో టెస్టు జరుగనుంది. వాస్తవానికి, శ్రీలంక ఈ ఏడాది అక్టోబర్‌లో టెస్టు సిరిస్ ఆడాలి. ఆ తర్వాత మళ్లీ డిసెంబరులో వైట్ బాల్ క్రికెట్ కోసం తిరిగి రావాల్సి ఉంది. టెస్ట్ వేదికలను నిర్ణయించే ముందు పరిస్థితిని అంచనా వేయడానికి గాను ఈ మ్యాచ్ షెడ్యూల్‌ను మార్చడం జరిగింది.

2009లో శ్రీలంక క్రికెటర్ల బస్సుపై ఉగ్రదాడి
ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ ప్రొగ్రామ్‌లో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు లంక బోర్డు వెల్లడించింది. 2009లో శ్రీలంక క్రికెటర్ల బస్సుపై ఉగ్రదాడి జరిగిన తర్వాత ఏ దేశం కూడా పాక్ పర్యటనకు వెళ్లేందుకు సాహాసించలేదు. ఇటీవలే శ్రీలంక ద్వితీయ శ్రేణి జట్టు మూడు టీ20ల సిరిస్ కోసం పాక్‌లో పర్యటించింది. ఈ పర్యటనకు శ్రీలంక సీనియర్ క్రికెటర్లు దూరమైనప్పటికీ ద్వితీయ శ్రేణి జట్టు మూడు టీ20ల సిరిస్‌ను క్లీన్ స్వీప్ చేసింది.

పాక్ పర్యటనకు శ్రీలంక జట్టు
దిముత్ కరుణరత్నే (కెప్టెన్), ఓషాడా ఫెర్నాండో, కుసల్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, దినేష్ చండిమల్, కుసల్ జనిత్ పెరెరా, జననం తిరిమన్నే, ధనంజయ డి సిల్వా, నిరోషన్ డిక్వెల్లా, దిల్రువన్ పెరెరా, లాసిత్ ఎంబల్‌దేనాయుర్, రజిత కసున్, లక్షన్ సందకన్

టెస్టు మ్యాచ్ షెడ్యూల్:
11-15 December 1st Test, పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి
19-23 December 2nd Test, నేషనల్ స్టేడియం, కరాచీ
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications