Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మెండిస్‌కు ఉద్వాసన: భారత పర్యటనకు లంక జట్టు ఇదే

హైదరాబాద్: భారత పర్యటనకు రానున్న జట్టుని శ్రీలంక క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. 15 మంది సభ్యులతో జట్టును శ్రీలంక క్రికెట్ బోర్డు ఆదివారం ప్రకటించింది. గాయం కారణంగా పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌కు దూరమైన మాథ్యూస్‌ మళ్లీ జట్టులో పునరాగమనం చేశాడు.

మరోవైపు కుశాల్‌ మెండిస్‌తో పాటు కుశాల్‌ సిల్వ, పేసర్‌ ప్రదీప్‌పై కూడా బోర్డు వేటు పడింది. కుమార సంగక్కర, జయవర్ధనే తర్వాత ఆ జట్టులో అత్యంత సీనియర్‌ ఆటగాడు మాథ్యూస్ కావడం విశేషం. భారత పర్యటనలో లంక మూడు టెస్టులతో పాటు మూడు వన్డేలు, మూడు టి20ల సిరీస్‌లు ఆడనుంది.

Sri Lanka announce 15-member squad for India tour

అరంగేట్రం నుంచి వరుసగా 22 టెస్టులాడిన కుశాల్‌ మెండిస్‌ తొలిసారిగా జట్టుకు దూరమయ్యాడు. శ్రీలంక ఆటగాళ్లు బుధవారం భారత్‌కు చేరుకోనున్నారు.

శ్రీలంక టెస్టు జట్టు
దినేస్ చండీమాల్ (కెప్టెన్‌), కరుణరత్నె, ధనంజయ, సమరవిక్రమ, మాథ్యూస్‌, తిరిమన్నె, హెరాత్‌, లక్మల్‌, పెరీరా, గమగె, సందకన్‌, ఫెర్నాండో, షనక, డిక్‌వెలా, రోషన్‌ సిల్వా.

Story first published: Monday, November 13, 2017, 12:18 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+