For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తెలుగు తేజం పేరిట చెత్త రికార్డు!‌

INDW vs AUSW: హోబర్ట్ వేదికగా ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో భారత బౌలింగ్ విభాగం ఘోరంగా విఫలమైంది. ఆస్ట్రేలియా బ్యాటర్ల విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత యువ స్పిన్నర్ శ్రీ చరణి ఓ మహిళా వన్డే మ్యాచ్‌లో 100కు పైగా పరుగులు సమర్పించుకున్న తొలి భారత బౌలర్‌గా నిలిచి.. ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. మ్యాచ్ ఆరంభం నుంచి ఆసీస్ బ్యాటర్లు దూకుడుగా ఆడటంతో భారత బౌలర్లు ఏ దశలోనూ వారిని అడ్డుకోలేకపోయారు.

శ్రీ చరణి స్పెల్.. ఓ పీడకల:
21 ఏళ్ల యువ ఎడమచేతి వాటం స్పిన్నర్ శ్రీ చరణికి ఈ మ్యాచ్ ఓ పీడకలలా మిగిలిపోయింది. తన 10 ఓవర్ల కోటాలో శ్రీచరణి ఏకంగా 106 పరుగులు ఇచ్చి కేవలం 2 వికెట్లు మాత్రమే తీసింది. మహిళా వన్డే క్రికెట్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో 100 కంటే ఎక్కువ పరుగులు ఇచ్చిన మూడో బౌలర్‌గా ఆమె నిలిచింది. గతంలో ఐర్లాండ్‌కు చెందిన కైరా ముర్రే (119 రన్స్), పాకిస్థాన్‌కు చెందిన షైరా ఖాన్ (111 రన్స్) మాత్రమే ఈ జాబితాలో ఉండగా.. ఇప్పుడు శ్రీ చరణి వారి సరసన చేరింది. ముఖ్యంగా తన చివరి ఓవర్‌లోనే ఆమె 22 పరుగులు సమర్పించుకోవడం ఆసీస్ బ్యాటర్ల ఆధిపత్యానికి నిదర్శనం.

Sri Charani Concedes 106 Runs vs Australia India Women Face Massive 410-Run Target in Hobart

దీప్తి శర్మకు కూడా నిరాశే:
జట్టులో అత్యంత అనుభవజ్ఞురాలైన దీప్తి శర్మ కూడా ఈ మ్యాచ్‌లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. దీప్తి శర్మ తన 10 ఓవర్లలో 90 పరుగులు ఇచ్చి భారత్ తరపున వన్డేల్లో రెండో అత్యంత ఖరీదైన స్పెల్ వేసిన బౌలర్‌గా నిలిచింది. గతంలో ప్రియా మిశ్రా (88 పరుగులు) పేరిట ఉన్న రికార్డును దీప్తి అధిగమించింది. సీనియర్ బౌలర్లే ఇలా ధారాళంగా పరుగులు ఇవ్వడంతో టీమిండియా ఆత్మరక్షణలో పడిపోయింది.

ఆకాశమే హద్దుగా విధ్వంసం:
తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 409 పరుగుల భారీ స్కోరు సాధించింది. తన కెరీర్‌లో చివరి వన్డే ఆడుతున్న ఆసీస్ కెప్టెన్ అలిస్సా హీలీ 158 పరుగులతో విశ్వరూపం చూపించగా.. బెత్ మూనీ 106 పరుగులతో సెంచరీ సాధించింది. వీరిద్దరి జోడిని విడదీయడానికి భారత బౌలర్లు పడరాని పాట్లు పడ్డారు. చివర్లో నికోలా కారీ కేవలం 15 బంతుల్లోనే 34 పరుగులు చేసి జట్టు స్కోరును 400 దాటించింది. భారత్‌పై ఆస్ట్రేలియాకు ఇది రెండో అత్యధిక వన్డే స్కోరు కావడం విశేషం.

భారీ లక్ష్యం.. కఠిన సవాలు
410 పరుగుల హిమాలయమంత లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ముందు ఇప్పుడు పెను సవాలుగా నిలిచింది. మహిళల వన్డే క్రికెట్‌లో ఇంతటి భారీ స్కోరును ఛేదించడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. అయితే భారత బ్యాటర్లు ఈ కఠినమైన లక్ష్యం ముందు ఎంతవరకు పోరాడతారో చూడాలి. బౌలర్లు చేసిన తప్పును బ్యాటర్లు సరిదిద్ది అద్భుతం చేస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

Story first published: Sunday, March 1, 2026, 14:33 [IST]
Other articles published on Mar 1, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+