Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRHvsRR : కోట్లు పెట్టి కొన్న బ్యాటర్.. ఐపీఎల్ అరంగేట్రం పక్కా.. బలంగా సన్‌రైజర్స్ టీం!

ఈ ఐపీఎల్‌లో తొలి మ్యాచ్ ఆడేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ రెడీ అవుతోంది. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను సన్‌రైజర్స్ ఎదుర్కొంటుంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ ఆడటం లేదు. అతనితోపాటు హెన్రిక్ క్లాసెన్, మార్కో జాన్సెన్ కూడా లేరు. దీంతో ఒక విధంగా సన్‌రైజర్స్ సగం బలంతోనే బరిలో దిగుతోంది. అయితే కీలక ఆటగాళ్లు లేకపోయినా పేపర్‌పై సన్‌రైజర్స్ బలంగా కనిపిస్తోంది.

ఐపీఎల్ మినీ వేలంలో రూ.13 కోట్లు పెట్టి సన్‌రైజర్స్ కొనుగోలు చేసిన హ్యారీ బ్రూక్ ఈ మ్యాచ్‌లోనే ఐపీఎల్ అరంగేట్రం చేయడం ఖాయమని తెలుస్తోంది. అతనితోపాటు కివీస్ ఫినిషర్ గ్లెన్ ఫిలిప్స్ కూడా బరిలో దిగుతాడు. వీరితోపాటు విండీస్ స్పిన్న మాంత్రికుడు అకీల్ హొస్సేన్‌తో సన్‌రైజర్స్ ఈ మ్యాచ్ ఆడనుంది. అంటే అనుమతి ఉన్నా కూడా నలుగురు కాకుండా ముగ్గురు విదేశీ ప్లేయర్లకే జట్టులో చోటు దక్కుతుందన్నమాట.

srh practice ipl 2023 2

సన్‌రైజర్స్ ఓపెనర్లుగా మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ వచ్చే అవకాశం ఉంది. లేదంటే బ్రూక్‌ను కూడా ఓపెనర్‌గా పంపొచ్చు. ఆ తర్వాత వరుసగా త్రిపాఠీ, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్ ఉన్నారు. ఇక బౌలర్ల విషయానికొస్తే నటరాజన్, అకీల్ హొస్సేన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్ ఈ బాధ్యతలను పంచుకుంటారు. ఈ లెక్కన చూసుకుంటే.. పేపర్‌పై సన్‌రైజర్స్ చాలా బలంగా కనిపిస్తోంది. మరి రాజస్థాన్ రాయల్స్‌ను ఓడిస్తుందేమో చూడాలి.

అఫ్ఘాన్ స్పీడ్‌స్టర్ ఫజల్లాక్ ఫరూఖీ, కార్తిక్ త్యాగి, మయాంక్ మార్కండే, అదిల్ రషీద్‌లలో ఒకరిని అవసరం అయితే ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. వీరి కన్నా వివ్రాంత్ శర్మను కూడా ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించే అవకాశం ఎక్కువగా ఉంది. మరి సన్‌రైజర్స్ ఈ ఏడాదిని విజయంతో ప్రారంభిస్తుందో లేక రాజస్థాన్ బలం ముందు తల వంచుతుందో తెలియాలంటే మాత్రం వేచి చూడక తప్పదు.

సన్‌రైజర్స్ జట్టు (అంచనా): మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠీ, హ్యారీ బ్రూక్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, టి నటరాజన్, అకీల్ హొస్సేన్, భువనేశ్వర్ కుమార్ (కెప్టెన్), ఉమ్రాన్ మాలిక్

Story first published: Sunday, April 2, 2023, 11:57 [IST]
Other articles published on Apr 2, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+