Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRHvsRR : విజయంపై కన్నేసిన సన్‌రైజర్స్.. పరుగుల వరద గ్యారంటీ..!

గతేడాది ఐపీఎల్ రన్నరప్‌గా నిలిచిన్ రాజస్థాన్ రాయల్స్‌తో తలపడేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సిద్ధం అవుతోంది. గతేడాది మినీ వేలానికి ముందు నికోలస్ పూరన్,కేన్ విలియమ్సన్ తదితర బడా ప్లేయర్లను సన్‌రైజర్స్ వదులుకుంది. ఈ క్రమంలోనే హెన్రిక్ క్లాసెన్, కొత్త కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ తమ దేశం తరఫున ఆడాల్సి ఉండడటంతో ఐపీఎల్ ఆరంభ మ్యాచులకు డుమ్మా కొడుతున్నారు. దీంతో వీళ్లిద్దరితోపాటు సన్‌రైజర్స్ కీలక పేసర్ మార్కో జాన్సెన్ కూడా ఈ మ్యాచ్ ఆడటం లేదు.

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ కెప్టెన్‌గా మార్క్రమ్ అదరగొట్టాడు. దీంతో అతనికే సన్‌రైజర్స్ పగ్గాలు అందించారు. ఇప్పుడు అతను కూడా లేకపోవడంతో భువనేశ్వర్ కుమార్ ఈ జట్టుకు కెప్టెన్సీ చేయాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో గతేడాది రన్నరప్, బలమైన రాజస్థాన్ రాయల్స్‌తో సన్‌రైజర్స్ తలపడనుంది. దీంతో ఈ మ్యాచ్‌పై అంచనాలు కూడా భారీ ఎత్తుగానే ఉన్నాయి. అయితే ఈ సీజన్‌ను ఎలాగైనా విజయంతో ప్రారంభించాలని సన్‌రైజర్స్ భావిస్తోంది.

bhuvneshwar kumar srh 01

ఇక ఈ మ్యాచ్ జరిగే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియాన్ని చూసేందుకు ఎగబడ్డారు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాఅత ఉఫ్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ ఆడనుంది. దీంతో సాధారణంగానే ఐపీఎల్ 16వ సీజన్ అభిమానుల్లో హీట్ పెంచుతోంది. ఇక ఇక్కడి పిచ్ విషయానికి వస్తే.. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్డేడియంలో పిచ్ ఎక్కువగా బ్యాటర్లకు సహకారం అందిస్తుంది. దీంతో ఇక్కడ హై స్కోరింగ్ మ్యాచ్ చూడొచ్చు. ఇక్కడ మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరే 183 కావడం గమనార్హం,

ఈ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు దాదాపు లేనట్లే కనిపిస్తోంది. వాతావరణం చాలా పొడిగా ఉంటుందని, అక్కడక్కడాా మబ్బులు కనిపించినా ఇవి వర్షానికి దారి తీయడం అసాధ్యమని వాతావరణ శాఖ అంచనా. ఈ మ్యాచులో సన్‌రైజర్స్ బ్యాటర్లు భారీ షాట్లు కనుక ఆడితే భారీ స్కోరు కూడా ఖాయంగా కనిపిస్తోంది. అలాగే ఈ మ్యాచ్‌లో ఫోకస్ అంతా భారత యువ పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ మీదనే ఉండనుంది. టీమిండియా అరంగేట్రం కూడా చేసిన అతను తన పేస్‌కు మరింత పదును పెట్టే అవకాశం ఉంది.

Story first published: Sunday, April 2, 2023, 10:40 [IST]
Other articles published on Apr 2, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+