Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRHvsRCB : రూ.13 కోట్ల ప్లేయర్ రీ ఎంట్రీ.. తనే మా ఎక్స్-ఫ్యాక్టర్ అంటున్న మార్క్రమ్ మామ..!

ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ కోసం ఆర్సీబీ రెడీ అయింది. ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఢీకొట్టేందుకు ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ సిద్ధమయ్యాడు. ఈ మ్యాచ్ గెలిస్తే ఆర్సీబీ ప్లేఆఫ్స్ అవకాశాలు చాలా మెరుగవుతాయి. అదే సమయంలో ఓడితే ప్లేఆఫ్స్ చేరడం దాదాపు అసాధ్యంగా మారుతుంది.

ఈ క్రమంలోనే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఫాఫ్ డుప్లెసిస్ తాము ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. అయితే ఇక్కడి పిచ్‌ను తడిపినా కూడా చాలా డ్రైగా కనిపిస్తోందని, ఎండ వేడికి పిచ్‌పై పగుళ్లు కూడా బాగానే వచ్చాయని నిపుణులు చెప్తున్నారు. ఈ పిచ్‌పై టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ చేస్తే మంచిదని చెప్పారు. ఇలాంటి పిచ్‌పై ఛేజింగ్ కష్టమని అభిప్రాయపడ్డారు.

Harry Brook SRH

ఇలాంటి పిచ్‌పై డుప్లెసిస్ తీసుకున్న నిర్ణయం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. అదే సమయంలో తమ జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే బరిలో దిగుతున్నామని డుప్లెసిస్ వెల్లడించాడు. హసరంగ, హాజిల్‌వుడ్ ఇద్దరూ చిన్న చిన్న గాయాలతో చివరి మ్యాచ్ ఆడని సంగతి తెలిసిందే. ఈ విషయంపై ప్రశ్నించగా.. ఫలానా ప్లేయర్ అని చెప్పని డుప్లెసిస్ మడమ గాయం కారణంగా అతను ఆడటం లేదన్నాడు.

ఈ పిచ్‌పై ముందుగా బ్యాటింగ్ చేయాలనే తాము అనుకున్నామని సన్‌రైజర్స్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ చెప్పాడు. తమ బౌలింగ్ చాాలా బలంగా ఉందని, అందుకే ఈ నిర్ణయం తమకు కలిసొస్తుందని అభిప్రాయడ్డాడు. తమ జట్టులో కొన్ని మార్పులు చేసినట్లు తెలిపాడు. హ్యారీ బ్రూక్ రీఎంట్రీ ఇస్తున్నాడని, అలాగే కార్తిక్ త్యాగి, నితీష్ కూడా ఆడుతున్నారని తెలిపాడు.

తాము పరువు కోసం ఆడుతున్నామని, ప్లేయర్లు అందరూ మంచి ఎనర్జీతో ఉన్నారని చెప్పాడు. హ్యారీ బ్రూక్ తమ టీంలో ఎక్స్‌ఫ్యాక్టర్ అవుతాడని అభిప్రాయపడ్డాడు. మరి ఈ నిర్ణయం టీంకు ఎంత వరకు కలిసొస్తుందో చూడాలి. అలాగే నితీష్ ఎలా ఆడతాడని కూడా చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సన్‌రైజర్స్ జట్టు: అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠీ, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిక్ క్లాసెన్, హ్యారీ బ్రూక్, గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, భువనేశ్వర్ కుమార్, కార్తిక్ త్యాగి, మయాంక్ డగర్, నితీష్ కుమార్ రెడ్డి

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, మైకేల్ బ్రేస్‌వెల్, అనూజ్ రావత్, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, వేన్ పార్నెల్, కర్ణ్ శర్మ, మహమ్మద్ సిరాజ్

Story first published: Thursday, May 18, 2023, 19:25 [IST]
Other articles published on May 18, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+