ఆర్సీబీతో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఇన్‌ఫామ్ బ్యాటర్ హెన్రిక్ క్లాసెన్ చెలరేగాడు. కేవలం 51 బంతుల్లోనే 104 పరుగులు చేశాడు. అయితే అతనికి మిగతా బ్యాటర్ల నుంచి సరైన సహకారం లభించలేదు. అయినా సరే సన్‌రైజర్స్ అద్భుతమైన స్కోరు చేసిందంటే దానికి కారణం క్లాసెన్ ఇన్నింగ్సే.
ఈ మ్యాచ్‌లో కొత్త ఓపెనింగ్ జోడీతో బరిలో దిగిన సన్‌రైజర్స్‌కు సరైన ఆరంభం దక్కలేదు. బ్రేస్‌వెల్ వేసిన ఒకే ఓవర్లో ఓపెనర్లు అభిషేక్ శర్మ (11), రాహుల్ త్రిపాఠీ (15) ఇద్దరూ పెవిలియన్ చేరారు. దీంతో ఆ జట్టు ఆత్మరక్షణలో పడిపోయింది. ఇలాంటి సమయంలో ఎయిడెన్ మార్క్రమ్ 20 బంతులు ఎదుర్కొని 18 పరుగులే చేయగలిగాడు.

అయితే అతనికి జతకలిసిన హెన్రిక్ క్లాసెన్ చెలరేగాడు. కెప్టెన్ మార్క్రమ్ భారీ షాట్లు ఆడేందుకు తడబడుతుంటే.. క్లాసెన్ మాత్రం తన సూపర్ ఫామ్‌తో అద్భుతమైన షాట్లు ఆడాడు. ఎడాపెడా బౌండరీలు బాదేసిన అతను కేవలం 49 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేసుకున్నాడు. అయితే సెంచరీ పూర్తయిన కాసేపటికే అతను అవుటయ్యాడు.
హర్షల్ పటేల్ వేసిన స్లో యార్కర్‌ను మిస్ జడ్జ్ చేసిన అతను క్లీన్ బౌల్డ్ అయ్యాడు. క్లాసెన్ 51 బంతుల్లో 104 పరుగులతో ఆకట్టుకున్నాడు. అతని బ్యాటింగ్ చూసిన సన్‌రైజర్స్ యజమాని కావ్య మారన్ కూడా చాలా సంతోషించింది. క్లాసెన్ సెంచరీ చూసి ఆమె చప్పట్లు కొడుతూ సెలబ్రేట్ చేసుకుంటున్న ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
అలాగే అభిమానులు కూడా క్లాసెన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. క్రికెట్ దేవుడు సచిన్ కూడా క్లానెస్ ఇన్నింగ్స్ క్లాస్ అంటూ మెచ్చుకున్నాడు. ఇదంతా చూసిన ఫ్యాన్స్ అయితే.. 'క్లాసెన్ కాకా నువ్వు కేక' అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరఫున తను ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ క్లాసెన్ అద్భుతంగా ఆడిన విషయాన్ని గుర్తుచేసి మరీ పొగుడుతున్నారు.