Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRHvsRCB : ఈ పిచ్‌పై 200 కొడతారని అనుకున్నాం: ఫాఫ్ డుప్లెసిస్

సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ అదరగొట్టింది. మంచి ఛేజింగ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. అతనికి డుప్లెసిస్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో సహకారం అందించాడు. దీంతో సన్‌రైజర్స్‌పై ఆర్సీబీ ఈజీ విక్టరీ సాధించింది. ఈ విజయంతో ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ముంబైని కిందకు నెట్టిన ఆర్సీబీ నాలుగో స్థానాన్ని కైవసం చేసుుకుంది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు కొత్త ఓపెనింగ్ జోడీ అభిషేక్ శర్మ (11), రాహుల్ త్రిపాఠీ (15) శుభారంభం ఇవ్వలేకపోయారు. కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ (18) కూడా విఫలమయ్యాడు. ఇలాంటి సమయంలో హెన్రిక్ క్లాసెన్ (104) చెలరేగాడు. ఎడాపెడా బౌండరీలు బాదేస్తూ ఆర్సీబీ బౌలర్లకు గుబులు పుట్టించాడు. అతనికి హ్యారీ బ్రూక్ (27 నాటౌట్) చక్కని సహకారం అందించాడు.

SRHvsRCB Today IPL Match Faf du Plesis reaction after huge victory

దీంతో ఆ జట్టు 186 పరుగులు చేసింది. ఈ టఫ్ టార్గెట్‌ను ఆర్సీబీ అద్భుతంగా ఆరంభించింది. ఛేజింగ్‌లో తొలి రెండు బంతులకు బౌండరీలు బాదిన కోహ్లీ.. ఎక్కడా నెమ్మదించలేదు. చివరి వరకు అద్భుతంగా ఆడాడు. ఈ క్రమంలోనే 61 బంతుల్లో సెంచరీ పూర్తిచేసుకున్నాడు. అతనికి ఫాఫ్ డుప్లెసిస్ (71) కూడా మంచి సహకారం అందించాడు. దీంతో లక్ష్యం దిశగా దూసుకుపోయిన టీం.. చివరకు 19.2 ఓవర్లలో 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ను చిత్తుచేసింది.

ఈ విజయంపై ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ సంతోషం వ్యక్తం చేశాడు. 'అమేజింగ్ ఛేజ్. ఈ వికెట్ చాలా బాగుంది. ఇక్కడ 200 మంచి స్కోరు అనుకున్నాం. క్లాసెన్ సెంచరీ చేసినా ఆ స్కోరు చెయ్యకుండా సన్‌రైజర్స్‌ను అడ్డుకోవడం కలిసొచ్చింది. మరీ ఎక్కువ బంతులు స్పిన్ అవలేదు. పిచ్ కూడా బాగుంది. దీంతో పాజిటివ్‌గా ఆడాలని అనుకున్నాం' అని తమ మైండ్ సెట్ ఎలా ఉందో డుప్లెసిస్ వివరించాడు.

'మేం ఈ మ్యాచ్‌లో బ్యాటుతో, చివరి మ్యాచ్‌లో బంతితో రాణించాం. కోహ్లీ, నేను మా బలాలు ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకుంటాయి. వేరే వేరే ఏరియాల్లో ఆడతాం. ఆన్ ఫీల్డ్ అలాగే ఆప్‌ ఫీల్డ్ చాలా మంచి ఫ్రెండ్స్. ఇదే జోరును చిన్నస్వామి స్టేడియానికి తీసుకెళ్లడం ముఖ్యం. ఎవే పరిస్థితులు కఠినంగా ఉంటాయి. చిన్నస్వామిలో మరో మస్ట్ విన్ గేమ్ ఆడటం మాకు చాలా అమేజింగ్‌గా ఉంటుంది' అని చెప్పుకొచ్చాడు.

Story first published: Friday, May 19, 2023, 7:25 [IST]
Other articles published on May 19, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+