ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ మరో కొత్త పెనింగ్ జోడీతో బరిలో దిగింది. ఈ మ్యాచ్‌లో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (11)తో కలిసి రాహుల్ త్రిపాఠీ (15) ఇన్నింగ్స్ ఓపెన్ చేశాడు. ఆరంభంలో మహమ్మద్ సిరాజ్, వేన్ పార్నెల్ వేసిన ఓవర్లలో ఈ ఇద్దరూ పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డారు.
అయితే ఆ తర్వాత మళ్లీ పార్నెల్ బౌలింగ్‌కు వచ్చినప్పుడు త్రిపాఠీ చెలరేగాడు. ఒక ఫోర్, ఒక సిక్సర్ బాదాడు. అభిషేక్ కూడా ఒక బౌండరీ బాదాడు. దీంతో సన్‌రైజర్స్ బ్యాటింగ్ గాడిన పడినట్లే కనిపించింది. ఇలాంటి సమయంలో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తన ప్లాన్ మార్చాడు. బంతిని వెంటనే మైకేల్ బ్రేస్‌వెల్‌కు అందించాడు.

మంచి అనుభవం ఉన్న బ్రేస్‌వెల్ తను వేసిన తొలి ఓవర్లోనే ఆర్సీబీకి మంచి ఓపెనింగ్ అందించాడు. తొలి బంతికే యువ ఓపెనర్ అభిషేక్ శర్మను అవుట్ చేశాడు. బ్రేస్‌వెల్ వేసిన బంతిని ఆఫ్‌సైడ్ బలంగా బాదేందుకు ప్రయత్నించిన అభిషేక్.. తను అనుకున్న విధంగా షాట్ ఆడలేకపోయాడు. దీంతో బంతి గాల్లో నేరుగా మహిపాల్ లోమ్రోర్ వైపు దూసుకెళ్లింది.
వేగంగా రియాక్ట్ అయిన లోమ్రోర్ ఈ క్యాచ్‌ను సులభంగా పట్టేశాడు. దీంతో అభిషేక్ నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. ఆ మరుసటి బంతికి కెప్టెన్ మార్క్రమ్ సింగిల్ తీశాడు. అప్పుడు మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చిన రాహుల్ త్రిపాఠీ తన స్టైల్‌లో బ్రేస్‌వెల్ జోరుకు బ్రేకులు వేసేందుకు ప్రయత్నించాడు.
బ్రేస్ వెల్ వేసిన డెలివరీని షార్ట్ ఫైన్ లెగ్ ఫీల్డర్ పైనుంచి బౌండరీకి తరలించేందుకు ప్రయత్నించాడు. కానీ అది సరిగా కనెక్ట్ కాలేదు. దీంతో గాల్లోకి లేచిన బంతి నేరుగా అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న హర్షల్ పటేల్‌కు చాలా ఈజీ క్యాచ్ దక్కింది. త్రిపాఠీ తనకు వచ్చిన అవకాశాన్ని సరిగా యూజ్ చేసుకోకుండానే పెవిలియన్ చేరాడు.
ఇలా తను వేసిన తొలి ఓవర్లోనే ఆర్సీబీకి బ్రేస్‌వెల్ మంచి బ్రేక్ ఇచ్చాడు. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మార్క్రమ్, హెన్రిక్ క్లాసెన్ ఇద్దరూ చక్కగా బ్యాటింగ్ చేస్తూ సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ నిర్మిస్తున్నారు. ఈ జోడీని విడగొట్టేందుకు డుప్లెసిస్ చేసిన ఏ ప్రయోగమూ పెద్దగా ఫలించలేదు.