Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRHvsPBKS : ఫామ్‌లో పంజాబ్.. తడబడుతున్న సన్‌రైజర్స్.. గెలిచే సత్తా ఎవరికి ఉంది?

ఐపీఎల్ 2023లో ఎవరూ ఊహించని విధంగా వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచిన జట్టు పంజాబ్ కింగ్స్. అదే సమయంలో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్. సన్‌రైజర్స్ ఆడిన తొలి మ్యాచ్‌లో ఆ జట్టు ప్రధాన ఆటగాళ్లు లేకపోవడంతో ఆ పరాజయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ లక్నోతో మ్యాచ్‌లో ఆ జట్టు ఓటమికి మాత్రం టీం మేనేజ్‌మెంట్ తప్పుడు నిర్ణయాలే కారణం.

అద్భుతంగా టర్న్ అవుతున్న పిచ్‌పై కనీసం సబ్‌స్టిట్యూట్స్‌లో కూడా అకీల్ హొస్సేన్ లేకపోవడం, కేవలం ముగ్గురు విదేశీ ప్లేయర్లతోనే బరిలో దిగడం కూడా సన్‌రైజర్స్ చేసిన పొరపాట్లే. ఇక వికెట్ కీపర్‌గా హెన్రిక్ క్లాసెన్, గ్లెన్ ఫిలిప్స్‌ను కాదని కొత్త కుర్రాడు అన్‌మోల్ ప్రీత్ సింగ్‌ను ఆడించారు. అతను కేవలం పార్ట్‌టైం కీపర్ కావడంతో పెద్దగా ఆకట్టుకోలేదు. ఇది కూడా సన్‌రైజర్స్ ఓటమికి కారణమే.

srh pbks match

ఇక పంజాబ్ విషయానికొస్తే ఈ జట్టు ఆడిన రెండు మ్యాచుల్లోనూ తాము నిర్దేశించిన లక్ష్యాలను కాపాడుకుంది. శామ్ కర్రాన్, నాథన్ ఎల్లీస్ వంటి క్వాలిటీ బౌలర్లు ఉన్న పంజాబ్ బౌలింగ్ ఎటాక్ ఎలాంటి బ్యాటర్లనైనా భయపెట్టేలా ఉంది. ఇక ఆ జట్టు మిడిలార్డర్ కూడా అద్భుతంగా ఆడుతోంది. టాపార్డర్‌లో కొత్త కుర్రాడు ప్రభ్‌సిమ్రాన్ చెలరేగుతున్నాడు. ఇంత బలంగా ఉంది కాబట్టే కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు పంజాబ్ ఓడించగలిగింది. అయితే హైదరాబాద్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను తక్కువ అంచనా వేయకూడదు.

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో కూడా సన్‌రైజర్స్ కొంత తడబడింది. అలాంటి సమయంలో కెప్టెన్ మార్క్రమ్.. బేసిక్స్‌ గురించి బాగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఏకంగా ట్రోఫీ నెగ్గాడు. గత మ్యాచ్‌లో పరిస్థితులను, తమ జట్టు బలాబలాలను లెక్కలోకి తీసుకునే సమయం మార్క్రమ్ దగ్గర లేదు. కాబట్టి ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఫేవరెట్లుగా బరిలో దిగుతున్నారు. ఎవరు గెలుస్తారని కన్‌ఫర్మ్‌గా చెప్పలేకపోయినా.. పంజాబ్‌ నెగ్గే అవకాశాలే కొంత ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Story first published: Sunday, April 9, 2023, 12:14 [IST]
Other articles published on Apr 9, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+