ఐపీఎల్ 2023లో వరుసగా రెండు మ్యాచుల్లో ఘోరంగా ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో మ్యాచ్‌కు రెడీ అవుతోంది. హైదరాబాద్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో బలమైన పంజాబ్ కింగ్స్‌తో సన్‌రైజర్స్ తలపడేందుకు రెడీ అవుతోంది. అయితే ఇక్కడే సన్‌రైజర్స్‌ను ఒక పెద్ద ప్రశ్న పట్టి పీడిస్తోంది. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో కూడా ఈ పొరపాటు వల్లనే సన్‌రైరజర్స్ ఓడిందనే వాదన కూడా ఉంది.
ఈ ఐపీఎల్‌లో తను ఆడిన రెండు మ్యాచుల్లోనూ పంజాబ్ గెలిచిన సంగతి తెలిసిందే. లక్నోతో మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధవన్ చెలరేగాడు. మిగతా బ్యాటర్లు కూడా విధ్వంసం సృష్టించగలరు. తాజాగా లియామ్ లివింగ్‌స్టోన్ కూడా ఈ జట్టుతో కలిశాడు. ఈ క్రమంలో సన్‌రైజర్స్‌పై కూడా పంజాబ్ గెలుస్తుందని, హైదరాబాద్‌కు మూడో ఓటమి కూడా తప్పదని కొందరు అనడం మొదలు పెట్టారు. దీని వల్లనే ఈ మ్యాచ్‌పై మరింత ఉత్కంఠ పెరుగుతోంది.

సఫారీ స్టార్లు ఎయిడెన్ మార్క్రమ్, మార్కో జాన్సెన్, హెన్రిక్ క్లాసెన్ ముగ్గురూ కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. కానీ మ్యాచ్‌లో కేవలం మార్క్రమ్ ఆడాడు. అయితే ఈ మ్యాచ్‌లో మార్క్రమ్ తను ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. అదే సమయంలో సన్‌రైజర్స్‌లో బయటపడిన మరో పెద్ద సమస్య బ్యాటింగ్. వినడానికి బ్యాటింగ్ లైనప్ బాగానే ఉన్నా కూడా పెర్ఫామెన్స్‌లో సన్‌రైజర్స్ ఆకట్టుకోవడం లేదు.
ఈ క్రమంలోనే గత మ్యాచ్‌లో చేసిన పొరపాటును సన్‌రైజర్స్ చేయకూడదని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అలాగే గ్లెన్ ఫిలిప్స్‌ను కూడా పక్కన పెట్టారని అన్నాడు. లక్నోతో మ్యాచ్‌లో వికెట్ కీపింగ్ చేసిన అన్‌మోల్‌ప్రీత్ సింగ్ బ్యాటింగ్‌లో ఫర్వాలేదనిపించినా.. వికెట్ కీపింగ్‌లో పూర్తిగా తేలిపోయాడు. అసలు ఏ బంతిని సరిగా క్యారీ చేయలేదు. దీంతో మంచి ఫామ్‌లో ఉన్న హెన్రీ క్లాసెన్‌ను ఎలాగైనా ఆడించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి మార్క్రమ్ మనసులో ముద్ర వేసింది.