Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRHvsLSG : క్లాసెన్ కాకపై బీసీసీఐ గుస్సా.. ఫైన్ విధించిన అంపైర్లు.. అమిత్ మిశ్రాపై కూడా..!

లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్‌లో చాలా డ్రామా జరిగింది. ఈ క్రమంలోనే సన్‌రైజర్స్ ఫినిషర్ హెన్రిక్ క్లాసెన్, లక్నో వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఇద్దరూ ఐపీఎల్ నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. దీంత క్లాసెన్ మ్యాచ్ ఫీజులో 10 శాతం ఫైన్ వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటింగ్ చేస్తుండగా.. సమద్ ఎదుర్కొన్న ఒక బంతిని అంపైర్లు నోబాల్ ఇచ్చారు. లక్నో కెప్టెన్ రివ్యూ కోరగా.. ఆ బంతిని థర్డ్ అంపైర్ ఫెయిర్ డెలివరీ అని తేల్చడంతో పెద్ద దుమారమే రేగింది. చూసే ప్రతి ఒక్కరికీ అది నోబాల్ అనే అనిపించింది. బాల్ ట్రాకింగ్‌లో కూడా బంతి వికెట్లకు తాకడం లేదని స్పష్టంగా కనిపించింది.

Heinrich Klaasen

అయినా సరే థర్డ్ అంపైర్ మాత్రం అది నోబాల్ కాదని అనడం దుమారం రేపింది. ఈ క్రమంలో సన్‌రైజర్స్ అభిమానులు లక్నో టీం డగౌట్‌పై మాటల దాడి చేశారు. వాళ్లు అలా చేయడంతో కాసేపు మ్యాచ్ ఆపేయాల్సి వచ్చింది. ఇలా ఫ్యాన్స్ బిహేవ్ చేయడం నచ్చని క్లాసెన్ వారిపై గట్టిగా అరిచాడు.

దీంతో ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ ఆర్టికల్ 2.7లోని నిబంధనలు అతను ఉల్లంఘించాడని అంపైర్లు నిర్ధారించారు. అతను లెవెల్ 1 తప్పు చేసినట్లు తేల్చారు. దీనికి క్లాసెన్ కూడా అంగీకరించడంతో అతని మ్యాచ్ ఫీజులో 10 శాతం ఫైన్ వేస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో ఈ మ్యాచ్‌లోనే ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.2లోని నిబంధనలు అమిత్ మిశ్రా ఉల్లంఘించాడు.

మ్యాచ్ ఎక్విప్‌మెంట్‌పై ప్రతాపం చూపించినందుకు అతను కూడా లెవెల్ 1 తప్పు చేసినట్లు అంపైర్లు నిర్ణయించారు. అయితే అతన్ని మందలించి వదిలేశారు. ఈ మ్యాచ్‌లో నికోలస్ పూరన్ ధనాధన్ ఆటతో లక్నో విజయం సాధించింది. అతనితోపాటు మార్కస్ స్టొయినిస్ కూడా అదరగొట్టాడు. ఈ ఓటమితో సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ ఆశలు దాదాపు ఆవిరయ్యాయి.

Story first published: Sunday, May 14, 2023, 9:09 [IST]
Other articles published on May 14, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+