Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRHvsLSG : త్రిపాఠీ మళ్లీ మెరుస్తాడా?.. టాప్ స్కోరు చేసే బ్యాటర్లు వీళ్లే!

ఐపీఎల్ ప్లేఆఫ్స్ చేరాలంటే లక్నో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌కు అంతా సిద్ధమైంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో గెలవడం రెండు జట్లకు కీలకమే. ఇప్పటికీ గణాంకాల ప్రకారం రెండు జట్లకు ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగానే ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో తమ జట్లను గెలిపించేందుకు కీలక బ్యాటర్లు కూడా రెడీగా ఉన్నారు. వీరిలో టాప్ స్కోర్ చేసేది ఎవరంటే?

క్వింటన్ డీకాక్: ఈ ఐపీఎల్‌లో చాలా టైం వరకు బెంచ్‌కే పరిమితమైన క్వింటన్ డీకాక్.. కేఎల్ రాహుల్ ఈ సీజన్‌కు దూరం అవడంతో జట్టులోకి వచ్చాడు. వచ్చీ రాగానే తను ఆడిన మొదటి మ్యాచ్‌లోనే 70 పరుగులతో ఆకట్టుకున్నాడు. మైదానం అన్ని వైపులా చూడచక్కని షాట్లతో అలరించాడు. అతను ఈ మ్యాచ్‌లో కూడా అదే ఫామ్ కొనసాగించాలని అనుకుంటున్నాడు. అదే జరిగితే లక్నోకు సూపర్ ఓపెనింగ్ లభించడం ఖాయం.

 SRHvsLSG

రాహుల్ త్రిపాఠీ: సన్‌రైజర్స్ ఆడిన చివరి మ్యాచ్‌లో అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న రాహుల్ త్రిపాఠీ కూడా అదే జోరు కొనసాగించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ ఆరంభంలో ఒక్క మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించిన అతను.. ఆ తర్వాత వరుస వైఫల్యాలు చూశాడు. అయితే చివరగా ఆడిన మ్యాచ్‌లో రాజస్థాన్‌పై కేవలం 29 బంతుల్లోనే 47 పరుగులతో ఆకట్టుకుంటున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా త్రిపాఠీ రాణించడం ఖాయంగా కనిపిస్తోంది.

కైల్ మేయర్స్: ఈ ఏడాది ఐపీఎల్ ఆరంభం నుంచి లక్నోకు మంచి ఆరంభాలు అందిస్తున్న ప్లేయర్ కైల్ మేయర్స్. చివరగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా జట్టుకు అద్భుతమైన ఆరంభం అందించాడీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్. తన కెరీర్‌లో తొలి ఐపీఎల్ సీజన్ ఆడుతున్న అతను 11 మ్యాచుల్లో 359 పరుగులతో ఆకట్టుకున్నాడు. సన్‌రైజర్స్‌పై కూడా అదే జోరు కొనసాగించేందుకు రెడీగా కనిపిస్తున్నాడు.

Story first published: Saturday, May 13, 2023, 13:27 [IST]
Other articles published on May 13, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+