Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRHvsLSG : కొత్త కుర్రాడికి జట్టులో చోటిచ్చిన మార్క్రమ్.. లక్నోపై గెలిచేనా?

రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ చావో రేవో అని తేల్చే మ్యాచ్‌కు అంతా సిద్ధమైంది. ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే సన్‌రైజర్స్ ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాలి. ఇలాంటి మ్యాచ్‌లో జట్టులో కీలక మార్పు చేసినట్లు సన్‌రైజర్స్ సారధి ఎయిడెన్ మార్క్రమ్ వెల్లడించాడు.

పిచ్ కొంత డ్రైగా కనిపిస్తోందని, ఎండ కూడా బాగానే ఉందని నిపుణులు చెప్తున్నారు. ఈ పిచ్ పూర్తి ఫ్లాట్‌గా ఉంటుందని, భారీ స్కోర్లు నమోదవడం గ్యారంటీ అని అభిప్రాయపడ్డారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ సారధి ఎయిడెన్ మార్క్రమ్ ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. అలాగే తమ జట్టులో కొన్ని కీలక మార్పులు చేసినట్లు తెలిపాడు.

markaram

బ్యాటింగ్ ఆల్‌రౌండర్ సన్వీర్ సింగ్‌ ఈ మ్యాచ్ ఆడుతున్నట్లు చెప్పాడు. అలాగే ఫజల్లాక్ ఫరూకీ జట్టులో చేరాడు. లక్నో కెప్టెన్ కృనాల్ పాండ్యా కూడా తమ జట్టులోకి కుర్రాళ్లను తీసుకున్నాడు. యుధ్‌వీర్ సింగ్, ప్రేరక్ మన్కడ్ ఆడుతున్నారని చెప్పిన అతను.. మొహ్‌సిన్ ఖాన్, దీపక్ హుడా ఇద్దరూ ఆడటం లేదని చెప్పాడు.

కేఎల్ రాహుల్‌కు గాయం అవడంతో జట్టులోకి వచ్చిన క్వింటన్ డీకాక్‌కు ఈ మ్యాచ్ చాలా కీలకం కానుంది. ఎందుకంటే ఐపీఎల్‌లో డీకాక్ ధాటిగా ఆడలేకపోయిన ఏకైక బౌలర్ భువనేశ్వర్ కుమార్. అతని బౌలింగ్‌లో డీకాక్ స్ట్రైక్ రేట్ 97 మాత్రమే. ఈ మ్యాచ్ అతనికి కూడా చాలా కీలకంగా మారనుంది.

సన్‌రైజర్స్ జట్టు: అన్‌మోల్ ప్రీత్ సింగ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠీ, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిక్ క్లాసెన్, గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, ఫజల్లాక్ ఫరూఖీ

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు: కైల్ మేయర్స్, క్వింటన్ డీకాక్, ప్రేరక్ మన్కడ్, కృనాల్ పాండ్యా, మార్కస్ స్టొయినిస్, నికోలస్ పూరన్, అమిత్ మిశ్రా, ఠాకూర్, రవిబిష్ణోయి, యుధ్‌వీర్, ఆవేష్ ఖాన్

Story first published: Saturday, May 13, 2023, 15:42 [IST]
Other articles published on May 13, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+