క్రికెట్‌లో ఒక పాత సామెత ఉంది. 'క్యాచెస్ విన్ యు మ్యాచెస్' అని. అంటే క్రికెట్ మ్యాచ్ గెలవాలంటే అన్ని ఒక్కోసారి క్యాచులే ముఖ్యం. అవి అందుకుంటేనే విజయం సాధిస్తాం లేదంటే ఓడిపోతాం అని దీనర్థం. సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ చూసిన ప్రేక్షకులు కూడా ఇదే సామెతను సన్‌రైజర్స్ జట్టుకు చెప్తున్నారు
ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఎట్టకేలకు విజయం సాధించింది. హ్యారీ బ్రూక్ (100 నాటౌట్) సెంచరీ, ఎయిడెన్ మార్క్రమ్ (50) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దీంతో ఈ మ్యాచ్‌లో 228 పరుగుల భారీ స్కోరు చేసింది సన్‌రైజర్స్. ఛేజింగ్ సమయంలో కేకేఆర్‌ను తమ సూపర్ బౌలింగ్‌తో ముప్పుతిప్పలు పెట్టారు. తొలి ఓవర్లోనే ఫామ్‌లో ఉన్న రహ్మనుల్లా గుర్బాజ్ (0)ను భువీ డకౌట్ చేశాడు.

ఆ తర్వాత మార్కో యాన్సెన్ కూడా ఒకే ఓవర్లో వెంకటేశ్ అయ్యర్ (10), సునీల్ నరైన్ (0)ను పెవిలియన్ చేర్చాడు. కేకేఆర్ కెప్టెన్ నితీష్ రాణా (74), రింకూ సింగ్ (58 నాటౌట్) ఇద్దరూ అద్భుతంగా పోరాడి ఆ జట్టుకు విజయం అందించేందుకు ప్రయత్నించారు.
కానీ డెత్ ఓవర్లలో సన్‌రైజర్స్ సూపర్ బౌలింగ్ చేసింది. ముఖ్యంగా చివరి ఓవర్లో ఉమ్రాన్ మాలిక్ సూపర్‌గా బౌలింగ్ చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఫీల్డింగ్ మాత్రం ఫ్యాన్స్‌కు కోపం తెప్పించింది.
చేతుల్లోకి వచ్చిన క్యాచులను కూడా కొందరు ప్లేయర్లు వదిలేశారు. ప్రపంచంలోనే బెస్ట్ ఫీల్డర్లలో ఒకడిగా చెప్పుకునే కివీస్ కీపర్ గ్లెన్ ఫిలిప్స్ కూడా చివర్లో తన చేతుల్లోకి వచ్చిన బంతిని నేలపాలు చేశాడు. అంతకుముందు వాషింగ్టన్ సుందర్ కూడా ఇలాగే చేతుల్లోకి వచ్చిన ఈజీ క్యాచ్‌ను జారవిడిచాడు. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఇలా మొత్తం ఏడుపైగా క్యాచులు వదిలేయడం గమనార్హం. ఇది చూసిన అభిమానులు అందరూ ఈ టీం ఫీల్డింగ్‌ను తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇదేం ఫీల్డింగ్‌రా మీ టీం ది అని తిట్టిపోస్తున్నారు.