Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRHvsKKR : బ్రూక్ సెంచరీ చాలా ప్రత్యేకం.. సన్‌రైజర్స్ చరిత్రలో ఒకే ఒక్కడు!

కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓపెన్గా వచ్చిన యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ చరిత్ర సృష్టించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ధనాధన్ ఫాట్లు ఆడిన అతను.. ఎడాపెడా బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే ఈ ఐపీఎల్‌లో తొలి సెంచరీ బాదాడు. మిడిల్ ఓవర్లలో అతని ఇన్నింగ్స్ వేగం కొంత తగ్గినా కూడా ఆ తర్వాత పేసర్లు రాగానే మళ్లీ చెలరేగాడు. వరుసగా బౌండరీల మీ బౌండరీలు బాదాడు.

కేవలం 55 బంతుల్లోనే 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అంతకుముందు ఆడిన మూడు మ్యాచుల్లో హ్యారీ బ్రూక్ పేలవ ప్రదర్శన చేశాడు. దీంతో అతన్ని మినీ వేలంలో రూ .13 కోట్లకు అనవసరంగా కొన్నారని, ఇలాంటి వారిని ఆడించడం కూడా వృధా అని విమర్శలు వచ్చాయి. వాటన్నింటినీ భరించిన బ్రూక్.. ఈ మ్యాచ్‌తో తనకు వచ్చిన చెడ్డపేరును తుడిచిపెట్టేశాడు.

harry brook srh

ప్రస్తుతం ఉన్న సన్‌రైజర్స్ బ్యాటింగ్ లైనప్‌లో ఈ టీం తరఫున సెంచరీలు చేసిన బ్యాటర్లు లేరు. ఇతర బ్యాటర్లు రాణించినా ఇప్పటి వరకు సెంచరీలు చేయలేదు. ఈ క్రమంలో బ్రూక్ చేసిన సెంచరీ చాలా ప్రత్యేకం. అంతేకాదు, సన్‌రైజర్స్ బ్యాటర్ వేరే జట్టు సొంత మైదానంలో ఇలా సెంచరీ చేయడం కూడా ఇదే తొలిసారి. గతంలో డేవిడ్ వార్నర్ వంటి ఆటగాళ్లు ఈ ఫ్రాంచైజీ కోసం సెంచరీలు చేసిన మాట వాస్తవమే.

అయితే వీళ్లందరూ కూడా తమ సొంత మైదానం అయిన ఉప్పల్‌లో మూడంకెల స్కోరు అందుకున్నారు. హ్యార బ్రూక్ మాత్రం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో తన తొలి ఐపీఎల్ సెంచరీ కొట్టి అందరికీ షాకిచ్చాడు. ఇప్పుడు ఈ సెంచరీ కారణంగానే బ్రూక్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. నిన్నటి వరకు అతన్ని తిట్టిపోసిన వాళ్లే.. ఇప్పుడు అతన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అతనో సూపర్ బ్యాటర్ అని తెగ మెచ్చుకుంటున్నారు.

Story first published: Saturday, April 15, 2023, 11:51 [IST]
Other articles published on Apr 15, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+