Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRHvsKKR : సన్‌రైజర్స్‌ అంటే రెచ్చిపోయే రస్సెల్.. ఈసారి కూడా ఆరెంజ్ ఆర్మీకి పీడకలేనా?

సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా సూపర్ మ్యాచ్‌కు అంతా రెడీ అయింది. సొంత మైదానంలో ఆడుతున్న కేకేఆర్ ఎలాగైనా సన్‌రైజర్స్‌ను ఓడించి మరో విజయం తమ ఖాతాలో వేసుకోవాలని ఉత్సాహంగా ఉంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌కు ఆండ్రీ రస్సెల్ కొరకరాని కొయ్యలా మారే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో ఫామ్‌లో లేకపోయినా రస్సెల్.. ఇంతకుముందు సన్‌రైజర్స్‌కు పీడకలలు మిగిల్చిన వాడే.

గతేడాది బ్రబోర్న్ స్టేడియం వేదికగా హైదరాబాద్, కోల్‌కతా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ టాపార్డర్ ఘోరంగా విఫలమైంది. ఇలాంటి సమయంలో నితీష్ రాణాతో కలిసి రస్సెల్ కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. కేవలం 29 బంతుల్లోనే 45 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆ తర్వాత ఛేజింగ్ సమయంలో బంతితో కూడా చెలరేగాడు. రెండు ఓవర్లలో రెండు వికెట్లు కూడా తీశాడు. కానీ మార్క్రమ్, రాహుల్ త్రిపాఠీ పోరాటంతో సన్‌రైజర్స్ విజయం సాధించింది.

 Andre Russell

పూణే వేదికగా ఈ రెండు జట్లు గతేడాది మరోసారి తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో కూడా కేకేఆర్ 93-5తో కష్టాల్లో పడింది. అలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన రస్సెల్ నాలుగు సిక్సర్లు, మూడు ఫోర్లతో కేవలం 28 బంతుల్లోనే 49 పరుగులు చేశాడు. దీంతో ఆ జట్టు చివరకు 177 పరుగుల స్కోరు సాధించింది. బంతితో కూడా చెలరేగిన అతను మూడు కీలక వికెట్లు కూడా తీసుకోవడంతో సన్‌రైజర్స్ కేవలం 123-8 స్కోరు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో రస్సెల్‌కే 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు కూడా దక్కింది.

2019లో రస్సెల్ సూపర్ ఫామ్‌ ప్రదర్శించాడు. ఆ ఏడాదిని సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లోనే కేకేఆర్ ప్రారంభించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 185 పరుగుల స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో కేకేఆర్ తడబడింది. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన రస్సెల్ కేవలం 19 బంతుల్లోనే 49 పరుగలతో అజేయంగా నిలిచాడు. చివరి రెండు ఓవర్లలో అయితే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బౌలింగ్‌లో కూడా రాణించిన అతను రెండు కీలక వికెట్లు కూడా తీసుకున్నాడు. మరి ఈ మ్యాచ్‌లో కూడా రస్సెల్ చెలరేగుతాడేమో చూడాలి.

Story first published: Friday, April 14, 2023, 17:51 [IST]
Other articles published on Apr 14, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+