ఐపీఎల్‌లో తొలి విజయం సాధించిన సన్‌రైజర్స్ అదే జోరు కొనసాగించేందుకు సిద్ధం అవుతోంది. మాజీ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌ను చివరి ఓవర్లో ఓడించిన కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా సన్‌రైజర్స్‌ను చిత్తు చేసేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్లు చేసేందుకు కొందరు బ్యాటర్లు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. మరి వాళ్లెవరో ఒకసారి చూస్తే..
ఎయిడెన్ మార్క్రమ్: సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అయితే ఈ ఐపీఎల్‌లో తను ఆడిన తొలి మ్యాచ్‌లో గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరిన అతను.. రెండో మ్యాచులో ఫర్వాలేదనిపించాడు. రాహుల్ త్రిపాఠీతో కలిసి 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి సన్‌రైజర్స్‌కు ఈ ఐపీఎల్‌లో తొలి విజయాన్ని అందించాడు. దీంతో అతని బ్యాటింగ్ మళ్లీ గాడిన పడినట్లే కనిపిస్తోంది. కాబట్టి కోల్‌కతాతో జరిగే మ్యాచ్‌లో కూడా సన్‌రైజర్స్ బ్యాటింగ్‌లో అతను కీలకం కానున్నాడు.

వెంకటేశ్ అయ్యర్ : ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడుతూ కోల్‌కతా తరఫున భారీ స్కోర్లు చేస్తున్న ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్. సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌లో కూడా ఇతను ఆ జట్టుకు చాలా కీలకం కానున్నాడు. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా 80పైగా పరుగులతో ఛేజింగ్‌ను ముందుండి నడపించాడీ ఎడం చేతి వాటం ప్లేయర్. సొంత మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌కు అతని బ్యాటింగ్ చాలా కీలకం. అతను కూడా తన ఫామ్‌ను కొనసాగించేందుకు రెడీగా ఉన్నాడు.

రాహుల్ త్రిపాఠీ :
సన్‌రైజర్స్‌కు తొలి విజయం దక్కడంలో కీలక పాత్ర పోషించిన బ్యాటర్ రాహుల్ త్రిపాఠీ. పంజాబ్‌తో మ్యాచ్‌లో 74 పరుగులతో అజేయంగా నిలిచిన అతను.. సన్‌రైజర్స్ మిడిలార్డర్‌లో చాలా కీలకంగా ఉన్నాడు. సన్‌రైజర్స్ ఓడిపోయిన మ్యాచ్‌లో కూడా ఫర్వాలేదనిపించిన అతను.. గెలిచిన మ్యాచ్‌లో అద్భుతంగా రాణించాడు. ఇదే ఫామ్ కొనసాగించి కోల్‌కతాపై కూడా భారీ స్కోరు చేసేందుకు త్రిపాఠీ ఉవ్విళ్లూరుతున్నాడు. మరి అతను ఈ మ్యాచ్‌లో ఎంత స్కోరు చేస్తాడో చూడాలి.