కోల్‌కతాతో జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తమ సొంత మైదానంలో మిస్టరీ స్పిన్‌తో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పోయించే కేకేఆర్‌ను ఎదుర్కొనేందుకు ట్యాలెంట్ ఉన్న ఆటగాడిని జట్టులోకి తీసుకున్నాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ టాస్ ఓడింది. టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ నితీష్ రాణా ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.
మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం ఉండే అవకాశం ఉందని, అందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని రాణా వెల్లడించాడు. అలాగే తమ జట్టులో ఎలాంటి మార్పులు లేవని, గుజరాత్‌తో ఆడిన జట్టుతోనే బరిలో దిగుతున్నామని స్పష్టం చేశాడు. అంటే ఈ టీంలో కీలక స్పిన్నర్లు అందరూ సన్‌రైజర్స్‌ను తిప్పలు పెట్టేందుకు రెడీగా ఉన్నారన్నమాట. అదే సమయంలో తమ జట్టులో ఒకే ఒక మార్పు చేసినట్లు ఎయిడెన్ మార్క్రమ్ వెల్లడించాడు.

ఈ సీజన్ ఆరంభం నుంచి తన జిడ్డు బ్యాటింగ్‌తో విమర్శలపాలు అవుతున్న సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను పక్కన పెట్టినట్లు తెలిపాడు. అతని స్థానంలో అభిషేక్ శర్మను ఆడిస్తున్నామని చెప్పాడు. మరి అభిషేక్‌ను మయాంక్‌తోపాటు ఓపెనింగ్ చేయడానికిి పంపుతారా? లేక గత మ్యాచ్‌లోలా హ్యారీ బ్రూక్‌తోనే ఓపెనింగ్ చేయిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఈ సీజన్‌లో తొలి విజయం సాధించిన తర్వాత జట్టులో వాతావరణం చాలా పాజిటివ్‌గా ఉందని మార్క్రమ్ అంటున్నాడు.
ఈ రెండు జట్లు తమ చివరి మ్యాచుల్లో విజయాలు సాధించాయి. చివరి ఓవర్లో ఐదు సిక్సర్లు బాది మరీ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌ను కోల్‌కతా ఓడించింది. అదే సమయంలో బలమైన పంజాబ్ కింగ్స్‌ను సన్‌రైజర్స్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ అన్ని విభాగాల్లో రాణించింది. ఈ మ్యాచ్‌లో కూడా అదే జోరు కొనసాగించాలని అనుకుంటోంది. మరి ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఎలా ఆడుతుందో చూడాలి.
సన్‌రైజర్స్ జట్టు: అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠీ, ఎయిడెన్ మార్క్రమ్, హ్యారీ బ్రూక్, హెన్రిక్ క్లాసెన్, మార్కో జాన్సెన్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్
కోల్‌కతా జట్టు: రహ్మనుల్లా గుర్బాజ్, ఎన్ జగదీశన్, నితీష్ రాణా, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, లోకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి, సూయశ్ శర్మ