Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRHvsKKR : ఉమ్రాన్‌కు చుక్కలు చూపించారుగా.. ఆ ఒక్క ఓవర్‌తో మ్యాచ్ మూడ్ మారిపోయింది!

కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌కు చుక్కలు చూపించారు. హ్యారీ బ్రూక్ (100 నాటౌట్), ఎయిడెన్ మార్క్రమ్ (50), అభిషేక్ శర్మ (32) అద్భుతంగా రాణించడంతో సన్‌రైజర్స్ భారీ స్కోరు చేసింది. నాలుగు వికెట్ల నష్టానికి 228 పరుగుల స్కోరు చేసింది. ఛేజింగ్‌లో కోల్‌కతాకు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది.

తొలి ఓవర్లోనే ఫామ్‌లో ఉన్న ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (0) ఖాతా తెరవకుండా అవుటయ్యాడు. భువనేశ్వర్ వేసిన బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన అతను బంతిని గాల్లోకి మాత్రమే లేపగలిగాడు. దాన్ని ఉమ్రాన్ మాలిక్ సులభంగా క్యాచ్ పట్టేశాడు. దీంతో ఒక్క పరుగు కూడా చెయ్యకుండానే కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే మార్కో యాన్సెన్ కూడా అద్భుతమైన ఓవర్ వేశాడు.

 Nitish Rana bashes Umran Malik

ఒకే ఓవర్లో వెంకటేశ్ అయ్యర్ (10), సునీల్ నరైన్ (0) ఇద్దర్నీ వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చాడు. దీంతో కేకేఆర్ డిఫెన్స్‌లో పడింది. ఇలాంటి సమయంలో స్టార్ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌కు బంతి అందించాడు సన్‌రైజర్స్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్. ఈ నిర్ణయమే మ్యాచ్‌ మొమెంటం కేకేఆర్ వైపు మొగ్గేలా చేసింది. తనపై కెప్టెన్ ఉంచిన నమ్మకాన్ని ఉమ్రాన్ ఏమాత్రం నిలబెట్టుకోలేకపోయాడు.

ఈ ఓవర్ ఎదుర్కొన్న కేకేఆర్ కెప్టెన్ నితీష్ రాణా.. ఉమ్రాన్‌కు చుక్కలూ చూపించాడు. తొలి బంతికి బౌండరీ బాదిన అతను.. ఆ తర్వాత ఒక్క బంతిని కూడా వదల్లేదు. ఈ ఓవర్లో అతను వరుసగా 4,6,4,4,4,6 బాదాడు. దీంతో ఈ ఒక్క ఓవర్లోనే ఏకంగా 28 పరుగులు వచ్చాయి. ఇది పవర్‌ప్లే చివరి ఓవర్ కావడంతో కేకేఆర్ ఈ పవర్‌ప్లేను మెరుగైన స్థితిలో ముగించింది.

ఇది చూసిన ఫ్యాన్స్ ఏమాత్రం సంతోషంగా లేరు. కేకేఆర్ ఫ్యాన్స్ అందరూ ఈ ఓవర్‌తో జోష్‌లోకి వచ్చారు. అయితే సన్‌రైజర్స్ అభిమానులు మాత్రం షాక్ తిన్నారు. కేవలం పేస్ మీదనే ఆధార పడితే ఇలాగే ఉంటుందని, కొంత బుర్ర కూడా వాడాలని ఉమ్రాన్‌కు సోషల్ మీడియాలో సలహాలు కూడా ఇస్తున్నారు. ఈ ఓవర్ తర్వాత ఉమ్రాన్‌కు బంతి ఇవ్వడానికి మార్క్రమ్ కూడా ఆలోచనలో పడిన మాట మాత్రం వాస్తవం.

Story first published: Friday, April 14, 2023, 22:55 [IST]
Other articles published on Apr 14, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+